Site icon NTV Telugu

Allu Arjun: మెగా రికార్డుకు రీచ్ అయిన పుష్పరాజ్.. తగ్గేదే లే అంటున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్!

Allu Arjun

Allu Arjun

Allu Arjun: దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఫిల్మ్‌ఫేర్‌ సౌత్ అవార్డ్స్ 70వ వేడుక ఫిబ్రవరి 21 శనివారం రాత్రి కేరళలోని కొచ్చిలో భారీ ఎత్తున జరిగింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఎందరో నటీనటులు ఈ వేడుకకు హాజరయ్యారు. 2024 సంవత్సరానికి గాను అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు అవార్డులు అందుకున్నారు. ‘పుష్ప 2’ సినిమాకిగానూ అల్లు అర్జున్‌ ఉత్తమ నటుడు అవార్డు, ‘35: చిన్నకథ కాదు’ చిత్రానికిగానూ నివేదా థామస్‌ ఉత్తమ నటి అవార్డులు అందుకున్నారు.

READ ALSO: The Kerala Story 2: ‘‘ఇలా గొడ్డు మాంసం ఎవరు తినిపిస్తారు.?’’ కేరళ స్టోరీపై అనురాగ్ కశ్యప్ విమర్శలు..

అల్లు అర్జున్ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్ లెక్కలను చూస్తే.. తాజాగా అందుకున్న ఉత్తమ నటుడు అవార్డుతో మొత్తం 7 ఫిలిం ఫేర్ అవార్డ్స్‌ను అందుకున్నారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి 7 ఫిలిం ఫేర్ అవార్డ్స్ అందుకున్న రికార్డును, తాజాగా తీసుకున్న అవార్డ్‌తో అల్లు అర్జున్ సమం చేసినట్లు అయ్యింది. ఈ స్టార్ హీరో పుష్ప, పుష్ప 2 సినిమాలతో పాన్ ఇండియా రేంజ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నాడు. 7 ఫిలిం ఫేర్ అవార్డ్స్‌తో మెగాస్టార్ రికార్డ్‌ను బన్నీ సమయం చేయడంతో ఆయన ఫ్యా్న్స్ మస్త్ ఖుషీ అవుతున్నారు. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ వరుస ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే ఆయన రెండు ప్రాజెక్ట్‌లను లైన్‌లో పెట్టిన సంగతి తెలిసింది. అందులో ఒకటి అట్లీ డైరెక్షన్‌లో రూపుదిద్దుకుంటుండగా, మరొక లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రాబోతుంది. ఈ సినిమాలతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో తన స్థానాన్ని మరింత సుస్థితరం చేసుకుంటాడని ఆయన ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

READ ALSO: Home Loan EMI: హోమ్ లోన్ కట్టడం కుదరలేదా? అయితే మీరు చేయాల్సిన మొదటి పని ఇదే!

Exit mobile version