Allu Arjun – Venkatesh Iyer: ఐకాన్ స్టార్ ను కలిసిన వెంకటేశ్ అయ్యర్.. అల్లు అయాన్ కు స్పెషల్ గిఫ్ట్..!

Allu Arjun

Allu Arjun

Allu Arjun Meets Cricketer Venkatesh Iyer: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఇండియన్ క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ లు ఓ ప్రత్యేక సమావేశంలో కలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా వెంకటేశ్ అయ్యర్, అల్లు అర్జున్ కుమారుడు అల్లు ఆయన్‌కు సర్‌ప్రైజ్ గిఫ్ట్ అందించాడు.

ఈ విషయాన్ని అల్లు అర్జున్ స్వయంగా తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. వెంకటేశ్ అయ్యర్‌తో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ, “టాలెంటెడ్ యంగ్ ఇండియన్ క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్‌ను కలవడం చాలా ఆనందంగా ఉంది. మా అబ్బాయి అయాన్ కు స్పెషల్ సైన్డ్ జెర్సీ గిఫ్ట్ ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. మీ భవిష్యత్ ప్రయాణానికి శుభాకాంక్షలు” అంటూ ట్వీట్ చేశారు.

షేర్ చేసిన ఫోటోల్లో అల్లు అర్జున్, వెంకటేశ్ అయ్యర్, అల్లు ఆయన్ కలిసి కనిపించారు. ఒక ఫోటోలో వెంకటేశ్ అయ్యర్ అల్లు అర్జున్‌కు బొకే అందిస్తుండగా, మరో ఫోటోలో అల్లు ఆయన్ చేతిలో ప్రత్యేకంగా సైన్ చేసిన క్రికెట్ జెర్సీ కనిపించింది. ప్రస్తుతం అల్లు అర్జున్ తన ‘రాక’ భారీ ప్రాజెక్టుతో బిజీగా ఉండగా.. వెంకటేశ్ అయ్యర్ కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మంచి ప్రదర్శన కనపరుస్తున్నాడు.