ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి ప్రాజెక్టుల విషయంలో వేగం పెంచారు. ఇటీవల అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్ వచ్చిన బన్నీని కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కలిశారు. అయితే వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా ఉంటుందని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుండగా, తాజాగా జరిగిన ఈ మిటింగ్‌లొ లోకేశ్ చెప్పిన కథపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్న అల్లు అర్జున్, వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఆ షూటింగ్ పూర్తి చేయనున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే, ఆ వెంటనే లోకేశ్ కనగరాజ్ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. ఇక లోకేశ్ ‘సినిమాటిక్ యూనివర్స్’ క్రేజ్ గురించి మనకు తెలియంది కాదు.. అందుకే ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ
Also Read : Telugu Box Office :2025 ఫైనల్ రేస్ స్టార్ట్.. బాక్సాఫీస్ వద్ద 8 సినిమాలు, ఆ నాలుగింటి పైనే అందరి కళ్లు!
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో బన్నీ చేయబోయే సినిమాపై కూడా క్రేజీ అప్‌డేట్ బయటకొచ్చింది. మొదట ఈ కాంబినేషన్‌లో సినిమా ఖరారైనప్పటికీ, మధ్యలో ఎన్టీఆర్ పేరు వినిపించింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ మళ్లీ అల్లు అర్జున్ వద్దకే వచ్చినట్లు తెలుస్తోంది. పురాణాల ఆధారంగా, ముఖ్యంగా ‘కార్తికేయుడి’ కథతో త్రివిక్రమ్ ఒక భారీ సోషియో ఫాంటసీ కథను సిద్ధం చేసినట్లు సమాచారం. ఒకవేళ లోకేశ్ సినిమా కంటే ముందే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి అల్లు అర్జున్ లైనప్ చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద మరోసారి భారీ ప్రకంపనలు ఖాయమనిపిస్తోంది.
