NTV Telugu Site icon

Allu Arjun : రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదేలే అంటున్న పుష్ప..

Bunny

Bunny

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ పుష్ప తర్వాత పూర్తిగా మారిపోయింది.. గతంలో చేసిన సినిమాలు ఒకలెక్క ఈ సినిమా తర్వాత రేంజ్ పెరిగింది.. ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా విడుదలై బాక్సాఫీస్ ను షేక్ చేసింది.. వరల్డ్ వైడ్ కలెక్షన్స్ కూడా తగ్గలేదు.. పుష్ప గాడి దెబ్బకు రికార్డులు బద్దలు అయ్యాయి. ‘పుష్ప’తో అల్లు అర్జున్ అలాంటి జాక్‌పాట్ కొట్టాడు.

ఎందుకంటే పెద్దగా అంచనాల్లేకుండా పాన్ ఇండియా రిలీజ్ చేస్తే దేశవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించింది.. ఈ సినిమా వచ్చి చాలా కాలం అయిన ఆ సినిమా మేనియా కొనసాగుతుంది.. ఈ సినిమా దెబ్బతో బన్నీ రేంజ్ పూర్తిగా మారిపోయింది.. దీంతో సీక్వెల్ విషయంలో అల్లు అర్జున్ రెమ్యునరేషన్ పెంచేశాడని వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ సినిమా రాకముందు వరకు అల్లు అర్జున్ గురించి తెలుగు, మలయాళ ప్రేక్షకులకు మాత్రమే తెలుసు. ఎప్పుడైతే ఈ సినిమా రిలీజైందే మొత్తం సీన్ మారింది..

పుష్ప 2 నుంచి ఇటీవల విడుదలైన టీజర్ అంచనాలను పెంచేస్తుంది. ఇక ఈ సినిమా ఓటీటీ రైట్స్ కూడా భారీ ధరలు అమ్ముడు పోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. దీంతో అల్లు అర్జున్ రెమ్యునరేషన్ కూడా పెంచేశాడట. తొలి పార్ట్ కోసం రూ.100 కోట్ల వరకు తీసుకున్నాడని, ఇప్పుడు సీక్వెల్ కోసం ఏకంగా రూ.150 కోట్లు తీసుకోబోతున్నాడని టాక్.. ఇదే నిజమైతే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నటుల్లో బన్నీ చేరిపోయినట్లే..

Show comments