Site icon NTV Telugu

Allu Arjun : అల్లు అర్జున్‌కు బిగ్‌ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇచ్చిన అల్లు అయాన్‌

Allu Ayaan

Allu Ayaan

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో బ్లాక్ బస్టర్ పుష్ప చిత్రానికి సీక్వెల్ గా రూపొందుతున్న పుష్ప ది రూల్‌ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. అయితే.. తాజా సమాచారం ఏమిటంటే, అల్లు అయాన్ లారీ బొమ్మను తన తండ్రి అల్లు అర్జున్‌కు బహుమతిగా ఇచ్చి దానిపై ‘పుష్ప’ అని రాశాడు. ఈ బొమ్మ ఫోటోను అల్లు అర్జున్ సోషల్‌ మీడియాలో షేర్ చేశారు. “నా స్వీటెస్ట్ సోల్ అయాన్ చిన్ని బాబు నుండి అందమైన బహుమతి” అని క్యాప్షన్ రాస్తూ అల్లు అర్జున్‌ పోస్ట్‌ చేశారు. భారీ సక్సెస్ ను అందించిన ఈ చిత్ర విజయాన్ని గుర్తు చేస్తూ ఆయాన్ ఇలాంటి గిఫ్ట్ అందించడంతో అల్లు అర్జున్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Also Read : Shanampudi Saidi Reddy : ఎంపీ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి స్థాయిని మరిచి వ్యాఖ్యలు చేస్తున్నారు

హైదరాబాద్‌లోని ఆర్‌ఎఫ్‌సిలో జరగబోయే షెడ్యూల్‌లో అల్లు అర్జున్ పుష్ప 2 సెట్స్‌లో జాయిన్ అవుతాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది.ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ బాణీలు సమకూర్చనున్నారు. ప్రస్తుతం టీమ్ 10 రోజుల షూటింగ్ కోసం వైజాగ్‌కు వెళ్లింది. షూటింగ్ శరవేగంగా కొనసాగుతుండటం విశేషం. ఫహద్ ఫాసిల్, సునీల్, అనసూయ నటిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది చిత్రం. మరోవైపు అల్లు అర్జున్ కోసం స్టార్ డైరెక్టర్లు ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది.

Also Read : Manik Rao Thakre : రేపటి నుంచి తెలంగాణ హాత్ సే హాథ్ జోడో అభియాన్ పాదయాత్రలు

Exit mobile version