NTV Telugu Site icon

Allu Arjun: అల్లు అర్జున్ ధరించిన ఈ స్వెట్‏షర్ట్ ధర ఎంతో తెలుసా?

Allu Arjunn

Allu Arjunn

ఐకాన్ స్టార్ హీరో పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ ఇప్పుడు వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు.. ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తున్నాడు.. దాదాపు షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తుంది.. మొదటి పార్ట్ కన్నా భారీ యాక్షన్ సన్నివేశాల తో సినిమాను తెరకేక్కిస్తున్నారు డైరెక్టర్ సుకుమార్.. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. సునీల్, అనసూయ, ఫహాద్ ఫాజిల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. కొన్ని నెలలుగా ఈ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది..

ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ సినిమా పై బజ్ ను క్రియేట్ చేస్తున్నాయి.. పుష్ప సినిమా పాన్ ఇండియా లెవల్ లో విడుదలైన వసూళ్ల సునామి సృష్టించింది.. ఉత్తరాదిలో బన్నీ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పుడు ఈ మూవీ సెకండ్ పార్ట్ కోసం నార్త్ అడియన్స్ ఎంతో ఉత్సాహంగా వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‏లో పుష్ప ది రైజ్ మూవీ స్పెషల్ స్క్రీనింగ్ వేయనున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఒకటి. దీంతో బన్నీ స్థాయి భారీగా పెరిగిపోతుంది..

ఇదిలా ఉండగా ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..ఇటీవల హైదరాబాద్ విమానాశ్రయంలో కనిపించారు. అయితే ఎప్పుడు తన ట్రెండీ స్టైలీష్ లుక్స్‏తో స్పెషల్ అభిమానులను ఆకట్టుకుంటారు బన్నీ. ఇటీవలే హైదరాబాద్ ఎయిర్ పోర్టులో బుర్బెర్రీ మోనోగ్రామ్ మోటిఫ్ అప్లిక్ కాటన్ స్వెట్ షర్ట్ ధరించి కనిపించాడు.. దాని ధర దాదాపు రూ.30 వేల వరకు ఉంటుందని చెబుతున్నారు.. ఇది విన్న ఆయన ఫ్యాన్స్ స్టైలిష్ స్టార్ అంటే ఆ మాత్రం ఉండాలని ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు..

Show comments