Allu Arjun: రెండు రోజుల క్రితం అల్లు అర్జున్ తన నాన్నమ్మ అల్లు కనకరత్నం (94) వయసులో కన్నుమూసిన సంగతి విదితమే. ఆవిడ చనిపోవడంతో చరణ్, చిరంజీవి, పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ తో పటు ఎందరో సినీ ప్రముఖులు వారికి సంతాపం తెలిపారు. ఇది ఇలా ఉండగా.. ఈ విషయం తన పని మీద ప్రభావం చూపకుండా అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘AA22xA6’ షూటింగ్ కోసం ముంబైకు వెళ్లారు. నాన్నమ్మ అంతక్రియలు జరిగిన రెండో రోజే షూట్‌కి చేరడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Aadi Srinivas: కాళేశ్వరాన్ని ఏటీఎంగా మార్చుకున్నారు.. వారి వద్ద కోట్ల రూపాయలు దొరకడం ఏంటి?
ఈ సినిమాను దర్శకుడు అట్లీ భారీ విజువల్ వండర్ గా తెరకెక్కిస్తున్నాడు. అనుకున్నదాని ప్రకారం, సినిమా 2027 మొదటికల్లా సిద్ధం అయ్యే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాలో దీపికా పదుకోనే ప్రధాన పాత్రలో నటించనున్నారు. రమ్యకృష్ణన్ కూడా ఇందులో కనిపిస్తారని గాసిప్స్ వస్తున్నా.. ఇంకా అధికారికంగా ప్రకటించబడలేదు. ఈ ప్రాజెక్ట్ ను సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సినిమాకు సాయి అభ్యంకర్ సంగీతం అందించనున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ఇంతటి కాస్త ఆసమయంలో కూడా తన వల్ల ఇతరులు ఇబ్బందులు ఎదురుకోకూడదని చేసిన పనికి పెద్దెత్తున ప్రశంసలు కురుస్తున్నాయి. అభిమానులు బన్నీకి సినిమాపై ఉన్న నిబద్ధత అలాంటిది అంటూ తెగ పొగిడేస్తున్నారు.
సెలెక్టర్ల నిర్ణయంపై Mohammed Shami అసంతృప్తి.. ఎందుకు ఎంపిక చేయలేదో చెప్పండి అంటూ?
