AA 22 : అల్లు అర్జున్ టైటిల్ అనౌన్స్మెంట్ కు టైమ్ ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు ఏప్రిల్ 8 వేడుకలు ఒక రోజు ముందే మొదలయ్యాయి. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న క్రేజీ కాంబినేషన్ – అల్లు అర్జున్ మరియు కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ సినిమాకు సంబంధించి ఈరోజు ఒక కీలక ప్రకటన వెలువడనుంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఈ సినిమా టైటిల్ కు సంబంధించి ఒక భారీ అనౌన్స్‌మెంట్ చేయబోతున్నాట్టు నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. రేపు (ఏప్రిల్ 8) అల్లు అర్జున్ పుట్టినరోజు కావడంతో, దానికి ఒకరోజు ముందే ఈ ట్రీట్ ప్లాన్ చేశారు.
Also Read : IPL Effect : సినిమా కలెక్షన్స్‌కు గండికొడుతున్న ఐపీయల్
Also Read
AA 22 ఒక హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ అని అట్లీ మార్క్ మాస్ ఎలిమెంట్స్‌తో పాటు భారీ VFX ఉండబోతున్నాయని సమాచారం. సోషల్ మీడియాలో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇప్పటికే కొన్ని పేర్లు వైరల్ అవుతున్నాయి. వాటిలో ‘అయాన్’ ‘లెగసీ‘ అనే టైటిల్స్ ప్రముఖంగా వినిపిస్తున్నాయి. జవాన్ వంటి భారీ హిట్ తర్వాత అట్లీ తీస్తున్న సినిమా కావడంతో అల్లు అర్జున్‌ను ఆయన ఏ రేంజ్‌లో చూపిస్తారో అని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే ఇతర కీలక పాత్రల్లో మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ వంటి స్టార్స్ కనిపిస్తారని టాక్. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ గా సాయి అభ్యంకర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. బన్నీ – అట్లీ ఎలాంటి కథతో వస్తారో ఎలాంటి టైటిల్ ఫిక్స్ చేస్తారోనని ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
-
Farmer Loan: రైతన్నలకు అలర్ట్.. 4 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షల వరకు లోన్..
-
TGBIE : సర్కారీ కాలేజీల్లో బిగ్ చేంజ్.. ఇంటర్ బోర్డు కీలక నిర్ణయాలు
-
CM Revanth Reddy : ఇది కాంగ్రెస్ సమస్య కాదు.. దేశ ప్రజల సమస్య
-
Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!