ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు మాస్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో భారీ ప్రాజెక్ట్ (AA22 x A6) తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో దీపికా పదుకొనే కథానాయికగా నటిస్తుండగా, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న మరియు జాన్వీ కపూర్ వంటి స్టార్ హీరోయిన్లు కూడా కీలక పాత్రల్లో మెరవనున్నారని సమాచారం. హాలీవుడ్ స్థాయి టెక్నీషియన్లతో, అత్యాధునిక వీఎఫ్ఎక్స్ (VFX) హంగులతో అట్లీ ఈ చిత్రాన్ని విజువల్ వండర్‌గా తీర్చిదిద్దుతున్నారు. 2027 వేసవిలో విడుదల కాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీ డీల్ విషయంలో సరికొత్త చరిత్ర సృష్టించబోతోంది.
Also Read : The Raja Saab : డార్లింగ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..ది రాజాసాబ్’ రిలీజ్ ట్రైలర్ అప్‌డేట్.. !
సమాచారం ప్రకారం, ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ. 600 కోట్ల భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ సాధించిన రూ. 275 కోట్ల రికార్డును ఇది రెట్టింపు కంటే ఎక్కువే కావడం విశేషం. దాదాపు రూ. 1000 కోట్ల భారీ బడ్జెట్‌తో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం, ఇండియన్ సినీ చరిత్రలోనే అత్యధిక ఓటీటీ రేట్ పలికిన సినిమాగా సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేయనుంది. ఇంకా అధికారిక ప్రకటన రాకముందే ఈ రేంజ్ బిజినెస్ బజ్ నడుస్తుండటం తో అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో “ఇది మా హీరో రేంజ్” అంటూ పండగ చేసుకుంటున్నారు.
