NTV Telugu Site icon

K Laxman: ఏపీలో కూటమి గెలుపు.. మోడీ మూడోసారి ప్రధాని కావడం ఖాయం..!

Laxman

Laxman

K Laxman: ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ-టీడీపీ-జనసేన కూటమిదే విజయం.. నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాని కావడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.. బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్‌ కె.లక్ష్మణ్.. పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆయేన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాని కావడం ఖాయం అన్నారు.. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే.. రిజర్వేషన్లు రద్దు చేస్తారని ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా కాంగ్రెస్ పార్టీ, ప్రాంతీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. రాహుల్ గాంధీ నుంచి రేవంత్ రెడ్డి వరకు మోడీ చేస్తున్న అభివృద్ధి గురించి మాట్లాడకుండా.. ప్రజల్లో చీలిక తీసుకువచ్చే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు.

Read Also: Guess The Actress : ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా? ఇలా మారిపోయిందేంటి?

ఇక, ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఓటమి ఖాయం.. మోడీకి సరితూగే నాయకుడు విపక్షాల్లో ఒకరు కూడా లేరన్నారు లక్ష్మణ్‌.. అవినీతి పార్టీలు, కుల పార్టీలు, కుటుంబ పార్టీలు ఎన్ని రకాలుగా దుష్ప్రచారం చేసినా.. నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాని అవుతారని స్పష్టం చేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో అవినీతి పార్టీల పాలనతో విసిగిపోయిన ప్రజలు.. మార్పు కోరుకుంటున్నారని తెలిపారు.. బీసీలను బానిసలుగా చేసి వైఎస్‌ జగన్ పాలన ఏ రకంగా జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ సారి ఆంధ్రప్రదేవ్‌లో బీజేపీ-టీడీపీ-జనసేన కూటమి గెలుపు ఖాయం అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్‌ కె.లక్ష్మణ్. కాగా, సార్వత్రిక ఎన్నికల వేళ తెలంగాణలో విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న కె.లక్ష్మణ్.. అప్పుడప్పుడు ఏపీలోనూ ప్రచారం నిర్వహిస్తోన్న విషయం విదితమే