Site icon NTV Telugu

AP Assembly Speaker: శాసనసభ స్పీకర్‌ ఎన్నిక.. అయ్యన్నపాత్రుడు తరపున పవన్‌, లోకేష్‌ నామినేషన్‌

Speaker

Speaker

AP Assembly Speaker: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి.. ఈ రోజు, రేపు రెండు రోజుల పాటు సమావేశాలు జరగనుండగా.. తొలిరోజు అసెంబ్లీలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్, మంత్రులు, వైఎస్‌ జగన్‌.. ఆ తర్వాత అక్షర క్రమంలో ఎమ్మెల్యేలు అంతా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు.. మరోవైపు.. రేపు శాసన సభ స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు సభ్యులు.. ఇప్పటికే సీనియర్‌ నేత, ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు ను స్పీకర్‌ అభ్యర్థిగా ఎంపిక చేశారు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. దీంతో.. శాసనసభ స్పీకర్ అభ్యర్థిగా చింతకాలయ అయ్యన్నపాత్రుడు నామినేషన్ దాఖలు చేశారు.. ఇక, అయ్యన్నపాత్రుడు తరపున నామినేషన్ దాఖలు చేశారు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి నేతలు.. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రులు నారా లోకేష్, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్ తదితర నేతలు పాల్గొన్నారు. కూటమికి తిరుగులేని మెజార్టీ ఉన్న నేపథ్యంలో.. స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు ఎన్నిక లాంఛనమే కానుంది.

Exit mobile version