Site icon NTV Telugu

Lakshadweep: లక్షద్వీప్‌ వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అదనపు విమానాన్ని ప్రారంభించిన అలయన్స్ ఎయిర్ లైన్స్

Alliance Airlines

Alliance Airlines

India-maldives Row: భారత్- మాల్దీవుల మధ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో లక్షద్వీప్‌ను సందర్శించాలని భావిస్తున్న ప్రజలకు గుడ్ న్యూస్.. లక్షద్వీప్‌కు నడుపుతున్న ఏకైక విమానయాన సంస్థ అలయన్స్ ఎయిర్ అదనపు విమానాలను ప్రారంభించింది. పర్యాటకుల సంఖ్య పెరగడంతో భారత విమానయాన సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు కొచ్చి- అగతి- కొచ్చికి అదనపు విమానాలు అందుబాటులో ఉండనున్నాయి. వారానికి రెండు రోజులు (ఆదివారం, బుధవారం) అదనపు విమానాలు నడుస్తాయని అలయన్స్ ఎయిర్ సీనియర్ అధికారి తెలిపారు.

Read Also: Madras High Court: అశ్లీల చిత్రాలు వ్యక్తిగతంగా చూడడం తప్పుకాదు..

ఇక, అలయన్స్ ఎయిర్ మాత్రమే లక్షద్వీప్‌కు విమాన సేవలు అందిస్తోంది. కేరళలోని కొచ్చి, అగతి ద్వీపం మధ్య ప్రయాణం కొనసాగుతుంది. ఈ విమానాశ్రయం లక్షద్వీప్ ద్వీపంలో ఉంది. అలయన్స్ ఎయిర్ లైన్స్ ప్రతి రోజూ 70-సీట్ల విమానాన్ని ఈ ద్వీపానికి నడుపుతుంది. విమానం పూర్తి సామర్థ్యంతో ప్రయాణిస్తోంది.. మార్చి వరకు అన్ని టిక్కెట్లు అమ్ముడయ్యాయని ఎయిర్‌లైన్ అధికారులు చెప్పారు. సోషల్ మీడియాలో లక్షద్వీప్ ట్రెండ్ కావడంతో ఒక్కసారిగా ఆ ద్వీపానికి వెళ్లేందుకు విమాన టిక్కెట్లకు డిమాండ్ భారీగా పెరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని.. ఈ మార్గంలో అదనపు విమానాన్ని నడిపిస్తున్నారు. అవసరమైతే, విమానాల ఫ్రీక్వెన్సీని మరిన్ని పెంచే అవకాశం ఉందని అలయన్స్ ఎయిర్ లైన్స్ ప్రకటించింది.

Read Also: CMD Musharraf: పతంగులు బహిరంగ ప్రదేశాల్లో ఎగురవేయండి.. ప్రజలకు సీఎండీ విజ్ఞప్తి..

ఇటీవల, స్పైస్‌జెట్ సీఈఓ అజయ్ సింగ్ లక్షద్వీప్ కోసం ప్రొఫెషనల్ కనెక్టివిటీ స్కీమ్ కింద విమానయాన సంస్థకు ప్రత్యేక హక్కులు ఉన్నాయని తెలిపారు. త్వరలో లక్షద్వీప్‌కు విమానాలను ప్రారంభిస్తామని చెప్పారు. అయితే, కొద్ది రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్ పర్యటనకు వెళ్లి అక్కడి అందమైన బీచ్‌లకు సంబంధిచిన చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈద్వీప్‌లో పర్యాటకాన్ని పెంచాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీనిపై మాల్దీవులకు చెందిన పలువురు మంత్రులతో పాటు అధికారులు భారతదేశానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేశారు. దీంతో భారత్- మాల్దీవుల మధ్య గ్యాప్ పెరిగింది.

Exit mobile version