Site icon NTV Telugu

Alleti Maheshwar Reddy : ఈ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుంది

Maheshwar Reddy

Maheshwar Reddy

ఈ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్ది ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ఘోష పేడుతుందని, తరుగు గతం కంటే ఎక్కువ తీస్తున్నారన్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారని, ఉత్తం కుమార్ రెడ్డి కూడా స్పందించడం లేదన్నారు మహేశ్వర్‌ రెడ్డి. బోనస్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం బోగస్ ప్రభుత్వం గా మారిందని, 5 ఎకరాల వరకే రైతు భరోసా అని చెప్పడం రైతులను మోసం చేయడం కాదా అని ఆయన ప్రశ్నించారు. కొనుగులు సెంటర్ లలో కోట్ల రూపాయల లంచాలు తీసుకుంటున్నారు… త్వరలోనే ఆధారాలు బయట పెడతామని, ఉత్తం కుమార్ రెడ్డి రాజీనామా చేయాలన్నారు.

 

ఆయనకు వ్యవసాయం మీద అవగాహన లేదని, రైస్ మిల్లర్ల తో ప్రభుత్వానికి ఏమైనా లావాదేవీలు ఉన్నాయా ఆయన వ్యాఖ్యానించారు. మంత్రి గారు రైస్ మిల్లర్లకు అండగా ఉన్నారా అని ఆయన ప్రశ్నించారు. గతం లో ఎన్నడూ చూడని దోపిడీ విలయతాండవం చేస్తుందని, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు మరిచి ఫిడేల్ వాయిస్తే బాగుండదని మహేశ్వర్‌ రెడ్డి అన్నారు. రైతాంగానికి అండగా ఉంటాం… త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని, రేవంత్ రెడ్డి మాటలు సినిమా డైలాగ్ ల చప్పట్లు కొట్టించుకోవడం తప్ప ఏమీ లేదన్నారు మహేశ్వర్‌ రెడ్డి అన్నారు. ఎప్పుడు పడిపోతుందో తెలియని ప్రభుత్వం అది అని ఆయన వ్యాఖ్యానించారు.

Exit mobile version