Site icon NTV Telugu

Alleti Maheshwar Reddy : నిర్మల్‌లో గత పాలకుల పాపాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి

Alleti Maheshwar Reddy

Alleti Maheshwar Reddy

నిర్మల్‌లో గత పాలకుల పాపాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిర్మల్ లో ప్రభుత్వ భూములను గత పాలకులు అన్యాక్రాంతం చేశారన్నారు. గతంలో చెప్పినట్లుగా ఆధారాలతో సహా కలెక్టర్‌కి ఫిర్యాదు చేశామని ఆయన వెల్లడించారు. వాస్తవాలను శేత్వార్ తో సహా పరిశీలించి అధికారులే విస్తుపోయారని, ప్రభుత్వ భూమిలోనే ప్రైవేట్ సంస్థ డీ మార్ట్ నిర్మాణం చేస్తున్నారన్నారు. సర్వే నెం. 256 ప్రభుత్వ భూమి, ఇందులో డీమార్ట్ కు అనుమతిచ్చారని ఆయన వెల్లడించారు. డీమార్ట్ భూమి, అనుమతులపై కలెక్టర్ విచారణ కొనసాగుతోందని, విజిలెన్స్ ఎంక్వైరీ చేసి, ల్యాండ్ గ్రాబింగ్ కింద చట్ట చర్యలు ఉంటాయన్నారు. బాధ్యులు ఎవరైనా కటకటల్లోకి వెళ్లాల్సిందేనని ఆయన అన్నారు.

Mamitha Baiju: అదేంటి మొన్న బాలా కొట్టాడు అంది.. ఇప్పుడేమో చాలా సున్నితమంటుంది

నిర్మల్ చుట్టుపక్కల గ్రామాల్లో డీ1 పట్టాల పేరుతో దోపిడి జరుగుతోందన్నారు. మాజీ మంత్రి ఇంద్రకరణ్ హయంలోనే 350 కొత్త పట్టాలు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. గతంలో డీ1 పట్టాలు కేవలం 200 మాత్రమేనని, నిర్మల్ నియోజకవర్గంలో దాదాపు 3వేల ఎకరాల భూమి బడా నేతలు కాజేశారన్నారు. 3వేల ఎకరాల్లో ఏడు, ఎనిమిది వందలే అసలైన డీ 1 పట్టాలు ఇచ్చారన్నారు. మిగతా 2వేల పైచీలుకు డీ1 పట్టాలు బోగస్ పేర్లు మీద తీసుకున్నారని, గతంలో చెప్పినట్లే ప్రభుత్వ భూములు కాపాడి పేదలకు ఇస్తామన్నారు. డీ1 పట్టాల భూముల దందాలో ఎంతటివారున్న చర్యలు తప్పవన్నారు మహేశ్వర్‌ రెడ్డి. దేవాలయాల భూములను ఓవర్గం కబ్జాచేసినా గత పాలకులు ఏమి అనలేదని, రాష్ట్రంలో దేవాలయాల భూములను కబ్జాచేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. ఆలయాల భూముల పరిరక్షణ కోసం రాష్ట్ర వాప్తంగా ఆందోళన చేస్తామని, పట్టణంలో దివ్యాగార్డెన్ , వెంచర్స్ లలోగాని ప్రభుత్వం భూములు ఉంటే..చర్యలు తప్పవన్నారు. ఇంద్రకరణ్ రెడ్డి బంధువులు, అనుచరులు ఎవరైనా చర్యలు తప్పవన్నారు.

Ponnam Prabhakar : కేటీఆర్ నువ్వు ఎక్కడ ఉన్నా బేడీలు వేసి తీసుకువస్తాం

Exit mobile version