Aa Okkati Adakku OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ‘ఆ ఒక్కటి అడక్కు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aa Okkati Adakku OTT Release Date: మల్లి అంకం దర్శకత్వంలో అల్లరి నరేశ్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఆ ఒక్కటి అడక్కు’. రాజీవ్ చిలక నిర్మించిన ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా కథానాయిక. ఇందులో వెన్నెల కిశోర్, వైవా హర్ష తదితరులు కీలక పాత్రలు పోషించారు. గత కొన్నేళ్ల నుంచి యాక్షన్ సినిమాలు, స్టార్ హీరోల మూవీస్‌లో కీలక పాత్రలు పోషిస్తూ వచ్చిన అల్లరి నరేశ్.. చాన్నాళ్ల తర్వాత తన మార్క్ కామెడీ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మే 3న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకున్నా.. భారీ వసూళ్లు మాత్రం రాబట్టలేకపోయింది.
నెల తిరక్కుండానే ఎలాండి హడావుడి లేకుండా ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఎలాగూ వీకెండ్ కాబట్టి థియేటర్లలో చూడని వారు ఎంచక్కా ఇంట్లోనే కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. మరి ఆ ఒక్కటి అడక్కు చిత్రానికి ఓటీటీ ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.
Also Read
- Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
- Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
- Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
అల్లరి నరేశ్ గత కొంతకాలంగా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఆ ఒక్కటి అడక్కుపై భారీ ఆశలు పెట్టుకున్నా.. అడియాశలయ్యాయి. ఇటీవలే ‘బచ్చల మల్లి’ సినిమా అప్‌డేట్ అల్లరి నరేశ్ అందించిన విషయం తెలిసిందే. 1990 కాలం నాటి భావోద్వేగ ప్రయాణం నేపథ్యంలో సినిమా వస్తోంది. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్నారు. ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఫేమ్ సుబ్బు మంగదేవి దర్శకుడు.
తాజావార్తలు
-
Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
-
Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
-
vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!