Pak Finance Minister: పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న తరుణంలో ఆ దేశ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ అభివృద్ధి బాధ్యతను భగవంతుడైన అల్లాహ్‌పై ఉంచారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టాల్సిన ఆర్థిక మంత్రి తన బాధ్యతలను, జవాబుదారీతనాన్ని గట్టు మీద పెడుతున్నట్టు వ్యవహరించారు. పాకిస్తాన్ దేశాన్ని ఆ దేవుడు సృష్టించినప్పుడు ఆ దేవుడే దాన్ని కాపాడుతాడని, అభివృద్ధి చేస్తాడని, సుసంపన్నం గావిస్తాడని ఆ దేశ ఆర్థిక మంత్రి పేర్కొన్నాడు. ప్రపంచంలో ఇస్లాం పేరిట ఏర్పడిన ఏకైక దేశం పాకిస్తాన్ అని పేర్కొంది.
ఇస్లామాబాద్‌లో జరిగిన ఒక ప్రారంభ కార్యక్రమంలో ప్రసంగించిన పాక్ ఆర్థిక మంత్రి, ఇస్లాం పేరుతో తమ దేశం అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ నాయకత్వంలో పాకిస్థాన్ పరిస్థితిని మెరుగుపరిచేందుకు తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారని ఆర్థిక మంత్రి అన్నారు.పీఎం షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వం మునుపటి ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని ప్రభుత్వం నుండి సమస్యలను వారసత్వంగా పొందిందని దార్ అన్నారు. పీఎం షరీఫ్ ప్రభుత్వం పగలు రాత్రి పని చేస్తోందన్నారు. ఎన్నికలకు ముందు పరిస్థితిని చక్కదిద్దేందుకు బృందం (పీఎం షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వం) ప్రయత్నిస్తోందని దార్ చెప్పారు.
Chartered plane crash: సాంకేతిక లోపంతో కూలిపోయిన చార్టర్డ్ విమానం
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్థాన్, ఘోరమైన వరదల తర్వాత తీవ్ర పరిణామాలతో కొట్టుమిట్టాడుతోంది. జనవరి 2023లో పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ అంతర్జాతీయ సమాజం నుంచి ఆర్థిక సహాయాన్ని బహిరంగంగా కోరాడు. వరదల నుండి కోలుకోవడానికి పాకిస్తాన్ 30 బిలియన్ల డాలర్లు అవసరమని చెప్పారు. గత ప్రభుత్వ దుశ్చర్యలు, ఐదేళ్ల క్రితం ప్రారంభించిన ‘నాటకం’ కారణంగా పాకిస్థాన్ నష్టపోతోందని ఇషాక్ దార్ అన్నారు. అలాగే 2013 నుంచి 2017 సంవత్సరాల మధ్య నవాజ్ షరీఫ్ నాయకత్వంలో పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందని.. పాకిస్థాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ దక్షిణాసియాలో అత్యుత్తమ క్యాపిటల్ మార్కెట్ అని, నవాజ్ షరీఫ్ హయాంలో ఐదో స్థానంలో ఉందని ఆయన అన్నారు. నవాజ్ హయాంలో పాకిస్థాన్ వృద్ధి బాటలో ఉందని, అయితే అది పట్టాలు తప్పిందని ఆయన అన్నారు.
Pakistan: ఘోరంగా పతనమైన పాక్ రూపాయి.. అప్పుల ఊబిలో ఊగిసలాట
మరోవైపు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దాయాది దేశం పాకిస్థాన్‌కు రూపాయి భారీ షాక్ ఇచ్చింది. దీంతో మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ చందంలా తయారైంది పాక్ పరిస్థితి. పొరుగు దేశం శ్రీలంకలాగే దివాళా దిశగా అడుగులేస్తోంది. ప్రస్తుత అంచనా ప్రకారం పాకిస్తాన్ రూపాయి విలువ భారీగా పతనమైంది. శుక్రవారం డాలర్‌తో పోలిస్తే పాకిస్థాన్ రూపాయి రూ.262.6గా నమోదైంది. దీని ద్వారా అంతర్జాతీయ మార్కెట్‌లో పాక్ రూపాయి మారకం విలువ అత్యల్ప స్థాయికి పడిపోయింది. ప్రస్తుత పాక్ ఆర్థిక పరిస్థితుల్లో ఏదైనా మిత్ర దేశం ఆదుకోవడమో, లేక ఇంటర్నేషనల్ మానెటరీ ఫండ్ (ఐఎమ్ఎఫ్) నుంచి రుణం రావడమో జరిగితే తప్ప ఇప్పటికిప్పుడు పాక్ పరిస్థితి మెరుగపడదు. లేకుంటే పాక్ పూర్తిగా దివాళా ప్రకటించడమే.