Site icon NTV Telugu

Alla Ramakrishna Reddy : పేదలకు ఇళ్ళు ఇవ్వటాన్ని న్యాయస్థానాలు ఆమోదిస్తాయనే నమ్మకం ఉంది

Alla Ramakrishna

Alla Ramakrishna

అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్ళు ఇవ్వటాన్ని చంద్రబాబు రియల్ ఎస్టేట్ వర్గం గతంలోనూ వ్యతిరేకించిందని మండిపడ్డారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి. ఇవాళ ఆయన ఎన్టీవీతో మాట్లాడుతూ.. ఇళ్ళ స్థలాలు ఇవ్వటానికి కోర్టు అనుమతించిందని, పేదలకు ఇళ్ళు ఇవ్వటాన్ని న్యాయస్థానాలు ఆమోదిస్తాయనే నమ్మకం ఉందన్నారు. సీఆర్డీఏ చట్టం ప్రకారమే అమరావతి ప్రాంతంలో 5 శాతం స్థలాన్ని పేదలకు కేటాయించాలని, తన ఐదేళ్ళ కాలంలో చంద్రబాబు ఈ ప్రాంతంలో పేదలకు ఎందుకు ఇళ్ళు ఇవ్వలేక పోయారు? అని ఆయన ప్రశ్నించారు. వచ్చే సంక్రాంతి నాటికి ఇళ్ళ నిర్మాణాలు పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు ఆళ్ల రామకృష్ణా రెడ్డి.

Also Read : IND vs BAN Fight: మూసుకుని పెవిలియన్‌కు పో.. భారత్, బంగ్లా ఆటగాళ్ల మధ్య గొడవ!

ఇదిలా ఉంటే.. రాజధాని అమరావతి అసైన్డ్‌ భూముల వ్యవహారంలో మాజీ మంత్రి నారాయణపై సీఐడీ నమోదు చేసిన కేసు.. చెల్లుబాటు కాదని సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ హైకోర్టులో వాదనలు వినిపించారు. రాజకీయ ప్రతీకారంతోనే వారిపై మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తప్పుడు ఫిర్యాదు చేశారని.. సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టేయాలని న్యాయస్థానాన్ని కోరారు.అసైన్డ్‌ భూముల వ్యవహారమై 2016 ఫిబ్రవరి 17న జారీచేసిన జీవో 41 సదుద్దేశంతో జారీచేశారని గుర్తు చేశారు. ఆ జీవో జారీకి సంబంధించిన నోట్‌ఫైల్‌ను పరిశీలిస్తే ఆయాశాఖల అధికారులెవరు అభ్యంతరం తెలపలేదని కోర్టుకు వివరించారు. అసైన్డ్‌ రైతుల ప్రయోజనాలను కాపాడటం కోసమే జీవో 41 తెచ్చారన్నారు. ఆ జీవో జారీ అయిన 32 రోజుల తర్వాత ఆనాటి ముఖ్యమంత్రి దానిని ధ్రువీకరించారని తెలిపారు. జీవో జారీ వెనక ఎలాంటి దురుద్దేశాలు లేవని.. జీవో ఇచ్చిన అయిదేళ్ల తర్వాత రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారన్నారు. పిటిషనర్లపై నమోదు చేసిన సెక్షన్లు చెల్లుబాటుకావని న్యాయస్థానం ముందుంచారు. పూర్తిస్థాయి వాదనలకు తగిన సమయం లేకపోవడంతో విచారణ నేటికి వాయిదా వేసింది. విచారణను వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వీఆర్‌కే కృపాసాగర్‌ ఆదేశాలు జారీ చేశారు.

Also Read : Headache: తలనొప్పితో భరించలేకపోతున్నారా.. ఈ సింపుల్ చిట్కాలు మీకోసమే..

Exit mobile version