NTV Telugu Site icon

Supreme Court: అబార్షన్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

supreme court

supreme court

Supreme Court: అబార్షన్‌పై సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పును వెలువరించింది. మహిళలందరూ సురక్షితమైన, చట్టబద్ధమైన అబార్షన్‌ ప్రక్రియకు అర్హులేనని.. ఈ విషయంలో వివాహిత, అవివాహిత మహిళ మధ్య ఏదైనా వ్యత్యాసాన్ని చేయడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు ఇచ్చింది. మరోవైపు భార్యతో బలవంతంగా శృంగారంలో పాల్గొనడం అత్యాచారం కిందికే వస్తుందని కోర్టు వెల్లడించింది. వైవాహిక అత్యాచారం నేరంగా పరిగణించాలని సుప్రీంకోర్టు తెలిపింది. భార్యకు బలవంతపు శృంగారం ద్వారా కలిగే గర్భాన్ని అబార్షన్ చేసుకునే అధికారం ఉందని తేల్చి చెప్పింది. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ ప్రకారం, ఎవరైనా 24 వారాలలోపే అబార్షన్‌కు అనుమతి ఉందని న్యాయస్థానం తెలిపింది. గర్భస్రావం హక్కును హరించడానికి స్త్రీ వైవాహిక స్థితి ఒక కారణం కాదని కోర్టు తీర్పు చెప్పింది.

CBI Raids: కర్ణాటక పీసీసీ చీఫ్‌ డీకే శివకుమార్ ఇంట్లో సీబీఐ సోదాలు

వివాహితుల అత్యాచారం విష‌యంలోనూ ప్రెగ్నెన్సీ యాక్ట్ వ‌ర్తిస్తుంద‌ని కోర్టు తెలిపింది. కేవ‌లం పెళ్లి చేసుకున్న మ‌హిళ‌లు మాత్రమే శృంగారంలో పాల్గొంటార‌న్న వాద‌న‌ను కూడా బ‌ల‌ప‌రుస్తుంద‌ని కోర్టు తెలిపింది. ప్రతి భారతీయ మహిళ తనకు నచ్చినది ఎంచుకునే హక్కు ఉందని పేర్కొంది. కేవలం వివాహిత స్త్రీలే శృంగారం చేయాలనే నిబంధన ఏమీ లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ జేబీ పర్దివాలాతో కూడిన ధర్మాసనం అబార్షన్ అంశంపై విచారణ చేపట్టింది. అవివాహ‌త మ‌హిళ 20 వారాల త‌ర్వాత గ‌ర్భాన్ని తొల‌గించ‌రాద‌న్న నియ‌మం స‌రైంది కాదు అని ధ‌ర్మాస‌నం అభిప్రాయ‌ప‌డింది. మ‌ణిపూర్‌కు చెందిన ఓ మ‌హిళ దాఖ‌లు చేసిన కేసులో సర్వోన్నత న్యాయస్థానం ఈ తీర్పునిచ్చింది.