తెలంగాణ చరిత్రలోనే ఇవాళ అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదైంది. ఇవాళ మధ్యాహ్నం 12వరకు 14,549 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైనట్లు విద్యుత్ శాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఇదే అత్యధిక విద్యుత్ డిమాండ్ అని విదుత్య్ శాఖ అధికారులు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో 15వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదయ్యే ఛాన్స్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే.. నిన్న సాయంత్రం 4గంటల వరకు 14,169 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. అయితే.. గత ఏడాది ఇదే రోజున 11,420 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదుకాగా.. మే నెల వరకు 15000 మెగావాట్ల వరకు చేరే అవకాశం వుందని విశ్వసనీయ సమాచారం.
Also Read : Cheetahs: ఈ సారి దక్షిణాఫ్రికా నుంచి 12 చిరుతలు.. వచ్చేది అప్పుడే?
ఇంకా వేసవికాలం మొదలుకాకముందే.. విద్యుత్తు వాడకం చుక్కలను తాకుతోంది. తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా శుక్రవారం సాయంత్రం 4.08 గంటలకు 14,169 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. గతేడాది ఫిబ్రవరి 10న కేవలం 11,822 మెగావాట్ల డిమాండ్ మాత్రమే ఉంది. కొద్దిరోజులుగా వ్యవసాయ బోర్లకు 10 గంటల్లో త్రీఫేజ్ కరెంటు ఇస్తున్నారు. శుక్రవారం నుంచి 12 గంటల నుంచి సరఫరా పెరగడంతో డిమాండ్ కూడా పెరుగుతోంది. శనివారం నుంచి వ్యవసాయ బోర్లకు 24 గంటల త్రీఫేజ్ సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో గరిష్టంగా 15 వేల మెగావాట్లకు మించి డిమాండ్ ఉండవచ్చని డిస్కమ్ లు అంచనా వేస్తున్నాయి.
Also Read : Health Tips : ఈ ఆరు రోజులు భార్యాభర్తలు దూరంగా ఉండాలి.. ఎందుకంటే
