Site icon NTV Telugu

Polycet 2023 : రేపు పాలిటెక్నిక్ ఎంట్రెన్స్.. సర్వం సిద్ధం

Polycet

Polycet

రేపు పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ పరీక్ష జరుగనుంది. పాలిటెక్నిక్ ఎంట్రన్స్- 2023 (పాలీసెట్ – 2023) పరీక్ష ను, రాష్ట్రం లోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాలిటెక్నిక్ ల లోని 3 సంవత్సరాల ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులతో పాటుగా, వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ డిప్లొమా కోర్సుల ప్రవేశానికై రేపు ఉదయం 11.00 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించుటకై నిబంధనల ప్రకారం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. పాలిసెట్-2023 కు రాష్ట్ర వ్యాప్తంగా 1,05,656 మంది అభ్యర్థులు 296 పరీక్ష కేంద్రాలలో హాజరవు తున్నారు. విద్యార్థులను పరీక్ష కేంద్రం లోనికి ఒక గంట ముందుగానే అనగా ఉదయం 10.00 గంటలకే అనుమతిస్తారు. కావున విద్యార్థులు ఉ.10.00 గంటలకే పరీక్ష హాలులోకి చేరుకొని OMR షీట్ లోని రెండు వైపుల వివరాలను పూర్తి చేసి సంతకం చేయవలసి ఉంటుంది.

Also Read : Alia Bhatt : బ్లాక్ డ్రెస్ లో అదరగొట్టిన అలియా భట్

విద్యార్థులు తమ వెంట HB black పెన్సిల్, ఏరేసర్, బ్లూ లేదా బ్లాక్ బాల్ తప్పక తీసుకొని రావలెను. పరీక్ష ప్రారంభం అయిన (ఉ 11.00 గం.) తరువాత ఒక్క (1ని.) నిమిషం ఆలస్యం అయినను అభ్యర్థిని పరీక్ష కేంద్రం లోనికి అనుమతించ బడరు. హాల్ టికెట్ మీద ఫోటో ప్రింట్ కానివారు ఒక పాస్పోర్ట్ సైజు ఫోటో మరియు ID ప్రూఫ్ (ఆధార్ కార్డు) తెచ్చుకోవలెను. పరీక్ష కేంద్రంలోకి సెల్ ఫోన్ కానీ, ఏ ఇతర ఎలక్ట్రానిక్స్ వస్తువులు కానీ అనుమతించబడవు. ఇంజనీరింగ్ డిప్లొమా చేయాలనుకునే వారు గణితం 60 మార్కులు, భౌతిక శాస్త్రం 30. మార్కులు మరియు రసాయన శాస్త్రం 30 మార్కులకు పరీక్ష రాయవలసి ఉంటుంది. వ్యవసాయం, ఉద్యానవన మరియు వేటరినరీ డిప్లొమా చేయాలనుకునే వారు అదనంగా జీవశాస్త్రం లో మరో 30 మార్కులకు పరీక్ష రాయవలసి ఉంటుంది.

Also Read : Zomato UPI: యూపీఐ ద్వారా జొమాటో సేవలు.. ఇక సీఓడీకి ముగింపు పలుకనుందా..?

Exit mobile version