Site icon NTV Telugu

Manipur Violence: మణిపూర్ హింసాకాండపై అఖిలపక్ష సమావేశం.. సీఎం బీరెన్ సింగ్‌ను తొలగించాలని డిమాండ్..!

Manipur

Manipur

Manipur Violence: మణిపూర్‌లో ప్రస్తుత పరిస్థితులపై చర్చించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. 3 గంటల పాటు సాగిన ఈ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. రాష్ట్ర సీఎం ఎన్ బీరెన్ సింగ్‌ను తొలగించాలని ప్రతిపక్షం డిమాండ్ చేయగా.. పలువురు ప్రతిపక్ష నాయకులు రాష్ట్రానికి అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని పంపాలని కోరారు. మే ప్రారంభంలో మణిపూర్ లో 4 రోజుల పర్యటన సందర్భంగా అమిత్ షా శాంతి కోసం విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా దుర్మార్గులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Read Also: Viral Video: తన గుడ్లను తీస్తున్న వ్యక్తిపై కొండచిలువ దాడి.. షాకింగ్ వీడియో

అయితే సమావేశం ముగిసిన తర్వాత మణిపూర్ ఇన్‌ఛార్జ్ మరియు బిజెపి అధికార ప్రతినిధి సంబిత్ మాట్లాడుతూ.. అఖిలపక్ష సమావేశంలో అందరూ తమ అభిప్రాయాన్ని నిలబెట్టుకున్నారని చెప్పారు. మణిపూర్‌లో అమిత్ షా పర్యటన అపూర్వమని అన్ని రాజకీయ పార్టీలు చెబుతున్నాయన్నారు. ప్రతిరోజూ ప్రధాని మోదీకి పరిస్థితి గురించి తెలియజేస్తున్నామని అమిత్ షా తెలిపారని పేర్కొన్నారు. మయన్మార్‌పై 10 కిలోమీటర్ల కంచె ఏర్పాటు చేశామని.. అక్కడ నుండి చొరబాట్లు జరుగుతున్నాయని తెలిపారు. అంతేకాకుండా అన్ని రాజకీయ పార్టీల నుంచి ఆయన సూచనలు తీసుకున్నట్లు తెలుపగా.. ప్రజల పలు సూచనలను అమిత్ షా గుర్తించారన్నారు. సరైన సమయంలో సరైన దిశలో తదుపరి చర్యలు తీసుకోబడతాయని సంబిత్ పేర్కొన్నారు.

Read Also: Rashmi Gautam Hot: రష్మీ కూడా క్లీవేజ్ షో మొదలెట్టేసింది.. లేటెస్ట్ ఫొటోలు చూశారా?

మరోవైపు ఆర్జేడీ నేత మనోజ్ ఝా మాట్లాడుతూ.. మణిపూర్ సీఎంను తొలగించాలన్న డిమాండ్ ప్రతిపక్ష పార్టీలదేనని అన్నారు. ఈ సీఎం ఉన్నంత మాత్రాన శాంతిభద్రతలు సాధ్యం కాదన్నది ప్రతిపక్షాలు చెబుతున్న మాట అని మనోజ్ తెలిపారు. అదే సమయంలో, శివసేన నాయకురాలు ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ, మణిపూర్‌కు అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని తీసుకురావాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయని, అంతేకాకుండా మణిపూర్ ప్రజల్లో నెలకొన్న అపనమ్మకాన్ని పోగొట్టేలా చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష పార్టీలైన తాము కోరినట్లు తెలిపారు. మణిపూర్‌కు అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని పంపాలని అఖిలపక్ష సమావేశంలో హోంమంత్రిని కోరామని డీఎంకే నేత తిరుచ్చి శివ చెప్పారు. త్వరలో శాంతి నెలకొనాలని.. ఈ హింసకాండ వల్ల రాష్ట్రంలో 100 మంది మరణించారని.. 60,000 మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని తెలిపారు. అయితే దీనిపై ప్రధాని ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం బాధాకరమని శివ అన్నారు.

Exit mobile version