NTV Telugu Site icon

Vikas Raj : గ్రామీణ ప్రాంతాల్లో చురుగ్గా ఓటింగ్ జరుగుతోంది

Vikas Raj

Vikas Raj

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న లోక్‌ సభ ఎన్నికలు రానేవచ్చాయి. తెలంగాణ, ఏపీతో పాటు 10 రాష్ట్రాల్లో లోక్‌ సభ ఎన్నికలకు ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే.. తెలంగాణలో నిన్న మధ్యాహ్నం నుంచి వర్షాలు కురుస్తుండటంతో అక్కడక్కడ పోలింగ్‌ ఏర్పాట్లకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురియడంతో పోలింగ్‌ సిబ్బంది ఇబ్బందులు ఎదర్కొన్నారు. వర్షాల వల్ల నిన్న, మొన్న చిన్న చిన్న ప్రాబ్లమ్ వచ్చిందని సీఈఓ వికాస్ రాజ్ అన్నారు.అందరూ సమయానికి పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారని, వాగులు వంకలు పొంగిపొర్లడంతో పోలింగ్ సిబ్బంది కష్ట పడ్డారన్నారు వికాస్‌ రాజ్‌. కొన్ని ప్రాంతాల్లో ఎడ్ల బండ్ల మీద ఎన్నికల సిబ్బందిని తరలించామని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా.. ఒక శాతం ఎన్నికల సిబ్బంది మాత్రమే సకాలంలో చేరలేదని, గ్రామీణ ప్రాంతాల్లో చురుగ్గా ఓటింగ్ జరుగుతుందన్నారు వికాస్‌ రాజ్‌. ఉదయం 9 గంటల వరకు 9.51% పోలింగ్ నమోదు అయ్యిందని ఆయన తెలిపారు. ఉష్ణోగ్రతలు తగ్గాయి. శాంతిభద్రతల సమస్య లేదని, మాక్ పోలింగ్ లో కొన్ని సమస్యలు వచ్చాయి.. సరిచేశామని ఆయన వెల్లడించారు.

 

పోలింగ్ స్టేషన్లలో భారీ సంఖ్యలో క్యూలైన్లు ఉన్నట్లు చెప్పారు. ఓటర్లు భారీగా తరలొచ్చు ఓటు వేస్తున్నట్లు వివరించారు. ఆదివారం మధ్యాహ్నం వర్షం కారణంగా పోలింగ్ సిబ్బంది పోలింగ్ కేంద్రానికి చేరడానికి కాస్త లేట్ అయినట్లు చెప్పారు. పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 5 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల 30 నిమిషాల మధ్య రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించారని చెప్పారు. అనంతరం మెయిన్ పోలింగ్ ప్రారంభమైందిని పేర్కొన్నారు. 13 సమస్యాత్మక నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ముగుస్తుందని చెప్పారు.