భారతదేశం, పాకిస్థాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత దృష్ట్యా, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆన్‌లైన్ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతకు సంబంధించిన ప్రతిపాదనలు ఆమోదించారు. రెండు దేశాలు ద్వైపాక్షిక చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని, యుద్ధం ఏ సమస్యకూ పరిష్కారం కాదని అందులో పేర్కొన్నారు. అణ్వాయుధాలు ఉన్న భారతదేశం, పాకిస్థాన్ ఎప్పటికీ యుద్ధం చేయలేవన్నారు. ఉగ్రవాదం, పౌరుల హత్యలను వ్యతిరేకించారు. ఇస్లామిక్ బోధనలు, అంతర్జాతీయ సూత్రాలు, మానవ విలువలలో ఉగ్రవాదానికి చోటు లేదన్నారు.
READ MORE: Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 8 మంది మావోయిస్టులు మృతి..
పాకిస్థాన్ సరిహద్దులో పెరుగుతున్న ఉద్రిక్తతను ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆందోళనకరంగా భావించింది. దేశాన్ని, ప్రజలను రక్షించడానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు తెలిపింది. ఈ క్లిష్టమైన సమయంలో ప్రజలు, పార్టీలు, సాయుధ దళాలు, ప్రభుత్వం కలిసి ముప్పులను ఎదుర్కోవాలని కోరుకుంటోంది. వక్ఫ్ రక్షణ కోసం ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు తన ప్రచారాన్ని కొనసాగిస్తుంది. కానీ ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, దాని బహిరంగ సమావేశాలు, కార్యక్రమాలను మే 16 వరకు నిలిపివేసింది.
READ MORE: Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 8 మంది మావోయిస్టులు మృతి..
