అలియా భట్ పేరుకు పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో ట్రిపుల్ ఆర్ సినిమాతో అందరికీ దగ్గరైంది.. ప్రస్తుతం వరుసగా బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది.. అలాగే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ సినిమా విషయాలను, లేటెస్ట్ అప్డేట్స్ ను అభిమానులతో పంచుకుంటుంది.. తాజాగా ఈ అమ్మడు గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..
నిన్న అంగరంగ వైభవంగా జరిగిన బాల రాముడి ప్రాణ ప్రతిష్ట అట్టహాసంగా జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరిగిన ఈ మహా క్రతువుకు దేశంలోని వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు.. ఆ కార్యక్రమానికి అలియాభట్, రణబీర్ కూడా పాల్గొన్నారు.. కాగా,అయోధ్యకు వచ్చిన అలియా కంటే ఆమె ధరించిన చీరనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఒక సింపుల్ బ్లూ కలర్ శారీలో ఈ వేడుకకు వచ్చింది అలియా.. ఆ చీర ప్రత్యేకత వల్ల అందరి చూపు చీర పైనే పడింది..
అలియా తన భర్త రణ్‌బీర్ కపూర్‌తో కలిసి అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి హాజరైంది. ఓ ప్రత్యేక విమానంలో అయోధ్యకు చేరుకున్నారు. అక్కడ అభిమానులతో ముచ్చటించారు..అలియా చీర కొంగుపై రామసేతు బ్రిడ్జి, హనుమాన్ చిత్రాలు కూడా ఉన్నట్లు అక్కడికొచ్చిన అతిథులు గుర్తించారు. ప్రస్తుతం అలియా చీర ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఫ్యాషన్‌లో తనకంటూ ఓ ట్రెండ్ క్రియేట్ చేసుకున్న అలియా భట్ ఇలా సందర్భానికి తగ్గట్టుగా ప్రత్యేకంగా డిజైన్ చేసిన చీరలో రావడం అందరిని ఆకట్టుకుంది..