NTV Telugu Site icon

ALH Dhruv helicopter: ఎయిర్‌పోర్టులో కుప్పకూలిన కోస్ట్‌గార్డ్‌ హెలికాప్టర్‌ .. టేకాఫ్ అవుతుండగా..

Helicopter

Helicopter

ALH Dhruv helicopter: ​ కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండియన్​ కోస్ట్​ గార్డ్(ఐసీజీ)​ హెలికాప్టర్ కూలిపోయింది. టేకాఫ్​ అయిన కొద్ది సేపటికే కూలిపోయిందని అధికారులు వెల్లడించారు. అది ఒక ఏఎల్‌హెచ్‌​ ధ్రువ్​ మార్క్-3 శిక్షణ​ హెలికాప్టర్​ అని తెలిపారు. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో ముగ్గురు వ్యక్తులున్నారని.. అందులో ఓ వ్యక్తికి చేయి విరిగినట్లు చెప్పారు. కోస్ట్ గార్డ్ ట్రైనింగ్ సెషన్‌లో టేకాఫ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

నెడుంబస్సేరి విమానాశ్రయం రన్ వే నుంచి టేకాఫ్ తీసుకునే ప్రయత్నంలో ఈ ఘటన మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ ఘటన జరిగింది. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. అయితే రన్ వేకు ఐదు మీటర్ల దూరంలో హెలికాప్టర్ కూలిపోవడంతో రన్ వేను తాత్కాలికంగా మూసివేశారు. ప్రమాదానికి గురైన హెలికాప్టర్‌ను అక్కడి నుంచి తరలించిన వెంటనే రన్‌వే తెరుచుకుంటుందని అధికారులు పేర్కొన్నారు.

Read Also: Accident: ఆయిల్ ట్యాంకర్-బస్సు ఢీ.. 27 మంది ప్రయాణికులకు గాయాలు

‘‘ఇండియన్ కోస్ట్ గార్డ్‌కు చెందిన ఏఎల్‌హెచ్ ధృవ్ మార్క్‌-3 హెలికాప్టర్‌ను పైలట్లు పరీక్షిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సమయంలో హెలికాప్టర్ సుమారు 25 అడుగుల ఎత్తులో ఉంది. ఏఎల్‌హెచ్ ధృవ్ ఫ్లీట్ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి ఐసీజీ కృషి చేస్తోంది’’అని ఐసీజీ అధికారులు తెలిపారు.

కాగా.. ముంబై తీరంలో నేవీ హెలికాప్టర్ ప్రమాదానికి గురికావడంతో మార్చి 8 నుంచి ఏఎల్ హెచ్ ధృవ్ హెలికాప్టర్లను నిలిపివేశారు. మార్చి 8న, భారత నావికాదళానికి చెందిన ALH బుధవారం ముంబై తీరంలో ప్రమాదానికి గురైంది. నేవల్ పెట్రోలింగ్ క్రాఫ్ట్ ద్వారా ముగ్గురు సిబ్బందిని సురక్షితంగా రక్షించినట్లు నేవీ తెలిపింది. ఈ ఘటనపై విచారణకు కూడా ఆదేశించినట్లు తెలిపారు.