Site icon NTV Telugu

Breaking: కాంగ్రెస్‌కు బిగ్ షాక్‌.. బీజేపీలోకి కీలక నేత…

Aleti Maheshwar Reddy

Aleti Maheshwar Reddy

Aleti Maheshwar Reddy Resignation: తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి మరో బిగ్‌ షాక్‌ తగిలినట్టు అయ్యింది.. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌గా ఉన్న ఏలేటి మహేశ్వర్‌రెడ్డి.. ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు.. తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో జరిగిన తాజా పరిణామాలపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో తేల్చుకుంటానంటూ.. ఆయనకే ఫిర్యాదు చేస్తానంటూ హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ వెళ్లిన ఆయన.. అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ నేతలతో టచ్‌లోకి వెళ్లారు.. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ తరుణ్‌ చుగ్‌తో సమావేశం అయ్యారు.. ఆ తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ కానున్నారు.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌, ఈటల రాజేందర్‌తో కలిసి ఆయన తరుణ్‌ చుగ్‌ దగ్గరకు వెళ్లారు.. ఈ సందర్భంగా మీడియా పలకరిస్తే.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశానని వెల్లడించారు.. బీజేపీ అధ్యక్షుడిని కలిసిన తర్వాత అన్ని వివరాలు చెబుతానన్నారు మహేశ్వర్‌రెడ్డి..

Read Also: Breaking: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణలో కీలక మలుపు..

మరోవైపు.. కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెబుతూ మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు మహేశ్వర్‌రెడ్డి.. కాంగ్రెస్‌ పార్టీలో 15 ఏళ్లుగా ఎమ్మెల్యేగా, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ తెలంగాణ రాష్ట్ర చైర్మన్‌గా వివిధ హోదాల్లో పనిచేశాను.. ఎన్నో ఆటంకాలను, అవరోధాలను ఎదుర్కొని పనిచేశాను.. ఎలాంటి ఆరోపణలు, మచ్చలేని చరిత్ర ఉన్న నేను.. ఏనాడూ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించలేదు.. అయితే, కాంగ్రెస్‌లో గత కొన్ని నెలలుగా జరుగుతన్న రాజకీయ పరిణామాలను చూస్తే పార్టీలో ఇడమలేనని అర్థమైంది.. అందుకే కాంగ్రెస్‌లో ఇక ఎంత మాత్రం కొనసాగలేనని భావించి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారు అంటూ.. ఖర్గేకు రాసిన లేఖలో పేర్కొన్నారు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి..

Exit mobile version