Site icon NTV Telugu

Alleti Maheshwar Reddy : నాలుగున్నర నెలల్లో రాష్ట్రంలో అనేక కుంభకోణాలు జరుగుతున్నాయి

Maheshwar Reddy

Maheshwar Reddy

ఆగస్టు సంక్షోభం భయంతోనే కోమటిరెడ్డి సీఎం అని రేవంత్ చెప్తున్నారని, ఏ ఊరికి వెళ్లిన అక్కడి నేతకు నీవే నెక్స్ట్ సీఎం అని ఆయనతో చెప్తున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి వ్యాఖ్యానించారు. ఇవాళ ఆయన రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. కేసీఆర్ 20మంది టచ్ లో ఉన్నారనే మాటలు చూస్తే .. కేసిఆర్ తో కోమటిరెడ్డి వెంకటరెడ్డి టచ్ లో ఉన్నారేమో అని ఆయన అన్నారు. నాకు అయితే అదే అనుమానం ఉందని, సీఎం హామీలను ప్రజలు నమ్మట్లేదన్నారు ఏలేటి మహేశ్వర రెడ్డి. అందుకే దేవుళ్ళ మీద ఓట్లు వేస్తున్నారని, ప్రజలు నమ్మట్లేదని దేవుళ్ళ మీద ఒట్టు వేయడం బాధాకరమన్నారు ఏలేటి మహేశ్వర రెడ్డి.

రుణమాఫీ ఒకే మిగిలిన హామీల మాటేమిటి? మిగతా హామీల కొరకు ఎంత మంది దేవుళ్ళ మీద ఒట్టు పెడతావు? అని ఆయన ప్రశ్నించారు. నాలుగున్నర నెలల్లో రాష్ట్రంలో అనేక కుంభకోణాలు జరుగుతున్నాయని, ఎన్నడు లేని విధంగా రైతులు గోస పడుతున్నారన్నారు. ఒక్క వైపు నీళ్లు లేక రైతులు బాధపడుతుంటే ఇంకో వైపు ధాన్యం కొనుగోలు చేయక రైతులు ఇబ్బంది పడుతున్నారని, అకాల వర్షాలతో ధాన్యం తడిచిందని, వీటిని ప్రభుత్వం కొనడం లేదన్నారు. పంటకు బోనస్ ఇవ్వట్లేదని ఆయన మండిపడ్డారు.

అంతేకాకుండా..’పంటకు గిట్టుబాటు ధర, తడిసిన ధాన్యం కొనుగోలు లేదు , మీరు ప్రకటించిన బోనస్ లేదు. రైతులకు ఇచ్చిన హామీల సీఎం కు నేను లేఖ రాస్తున్న. వ్యవసాయ రంగానికి మీరిచ్చిన హామీల ప్రకారం లక్ష కోట్లు అవసరం. అంత బడ్జెట్ ఎక్కడి నుంచి జమ చేస్తారు? కళ్యాణ లక్ష్మి , తులం బంగారం వస్తదని ఆడపడుచుల పెళ్ళీలు పోస్ట్ పోన్ చేసుకున్నారు. విద్యార్థులకు స్కూటి లా మాటేమైంది?. మీరు ఇచ్చిన హామీల బాగోతం చిత్త బయట పెడతాం. ఇవన్నీ ఆగస్టు లోపల నెరవేరుస్తావా? లేదంటే రాజీనామా చేస్తావా?. రాజకీయం కోసం దేవుళ్ళ మీద ఒట్టు పెట్టీ… దేవుళ్ళను వాడుకుంటున్నాడు. ఆగస్టు వరకు రేవంత్ ఉంటాడో లేదో తెలీదు. ఆ ఒట్టు గట్టు మీద అవుతాదేమో’ అని ఏలేటి మహేశ్వర రెడ్డి వ్యాఖ్యానించారు.

Exit mobile version