Site icon NTV Telugu

Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేటి నుంచి ఆర్జిత సేవ, దర్శన టికెట్లు విడుదల

Tirumala

Tirumala

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి టోకెన్లు లేని వారికి 24 గంటల టైం పడుతోంది. ఇవాళ్టి నుంచి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదలకు టీటీడీ నిర్ణయించింది. తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 27 నుంచి 29వ తేదీ వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. అయితే ఈ రోజు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను టీటీడీ అధికారులు విడుదల చేయనుననారు. భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా టిటిడి షెడ్యూల్ ప్రకారం తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా సెప్టెంబరు నెల కోటాను ఈ రోజు విడుదల చేయనుంది.

Read Also: Daaku Haseena: 10 రూపాయల ఫ్రూటీ.. రూ. 8 కోట్ల దోపిడీ నిందితుల్ని పట్టించింది.. ఎలాగో తెలుసా..?

సెప్టెంబరు నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్ లైన్ లక్కీడిప్ కోసం ఇవాళ ఉదయం 10 గంటల నుంచి 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు అని తెలిపింది. లక్కీడిప్ లో టికెట్లు పొందిన భక్తులు డబ్బు చెల్లించి వాటిని ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. శ్రీవారి భక్తులు https://tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ లో వీటిని బుక్ చేసుకోవచ్చు అని పేర్కొంది. కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవాటికెట్లను జూన్ 22వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీపీ రిలీజ్ చేయనుంది. సెప్టెంబర్ నెల కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవ వర్చువల్ సేవల కోటాను, అదేవిధంగా వాటికి సంబంధించిన దర్శన టికెట్ల కోటాను జూన్ 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.

Read Also: Garlic Side Effects: వెల్లుల్లి ఎక్కువగా తింటున్నారా?.. ఈ అనారోగ్య సమస్యలు తప్పవు!

అలాగే.. సెప్టెంబర్ నెల ఆంగప్రదక్షిణం టోకెన్ల కోటాను జూన్ 23వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. జూన్ 22న శ్రీవారి పవిత్రోత్సవాల సేవాటికెట్లను రిలీజ్ చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 27 నుంచి 29వ తేదీ వరకు జరుగనున్న పవిత్రోత్సవాల సేవా టికెట్ల కోటాను టీటీడీ జూన్ 22వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. అయితే నిన్న (ఆదివారం) 87,762 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 43,753 మంది తలనీలాలు సమర్పించారు. రూ 3.61 కోట్ల మేర హుండీ ఆదాయం వచ్చింది. కంపార్టుమెంట్లు భక్తులతో నిండాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జూన్ 22వ తేదీ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు.. శ్రీవారి సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు జూన్ 24 నుంచి 26వ తేదీ వరకు జరుగనున్నాయి.

Exit mobile version