NTV Telugu Site icon

Tirumala: నడక మార్గంలో తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్

Ttd

Ttd

Tirumala: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని ప్రతీరోజూ వేలాది మంది దర్శించుకుంటారు.. ఇక, ఏదైనా ప్రత్యేకమైన రోజు వచ్చినా.. శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నా.. తిరుమల గిరులు భక్తులతో కిక్కిరిసిపోతాయి.. మరోవైపు.. ప్రతీరోజూ వేలాది మంది నడక మార్గంలో తిరుమల వెళ్తుంటారు.. శ్రీవారిని దర్శించుకుంటారు.. ఇప్పుడు నడక మార్గంలో తిరుమల వెళ్తున్న భక్తులకు అలర్ట్.. శ్రీవారి మెట్టు నడకమార్గంలో భక్తులకు జారి చేసే టోకేన్ల స్కానింగ్ పున:ప్రారంభించాలని టీటీడీ నిర్ణయించింది.. శ్రీవారి మెట్టు నడకమార్గంలో భక్తులుకు జారి చేసే టోకేన్లు 1200 మెట్టు వద్ద స్కాన్ చేసిన తర్వాత దర్శనానికి అనుమతించనుంది టీటీడీ.. గతంలో నడకమార్గంలో చిరుత దాడుల ఘటనతో టోకేన్ జారి విధానంలో మార్పులు చేశారు అధికారులు.. దీంతో, స్కానింగ్ విధానం లేకపోవడంతో నడకదారి భక్తులకు జారి చేసే టోకేన్లు పక్కదారి పడుతున్నాయని టీటీడీ కొత్త ఈవో శ్యామలరావు దృష్టికి తీసుకెళ్లారు విజిలెన్స్‌ అధికారులు.. ఈ నేపథ్యంలో తిరిగి పూర్వపు విధానాని కోనసాగించాలని అధికారులను ఆదేశించారు ఈవో..

Read Also: Heart Attack : ఈ టీని రోజూ తాగితే హార్ట్ ఏటాక్ జన్మలో రాదు.. ఆ సమస్యలు పరార్..