NTV Telugu Site icon

Alapati Rajendra Prasad: అలిగిన ఆలపాటి.. రంగంలోకి అధిష్టానం..

Alapati Rajendra Prasad

Alapati Rajendra Prasad

Alapati Rajendra Prasad: సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధం అవుతోన్న తెలుగుదేశం పార్టీ.. ఈ రోజు 11 అసెంబ్లీ స్థానాలతో పాటు 13 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.. టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య పొత్తులో భాగంగా 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్‌ స్థానాల్లో బరిలోకి దిగనున్న టీడీపీ.. ఇప్పటికే 128 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. ఈరోజు తాజాగా మరో 11 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు వెల్లడించింది.. అయితే, టీడీపీ తాజా జాబితాలో కొన్ని నియోజకవర్గాల్లో చిచ్చు పెట్టింది.. ఈ జాబితాలో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు చోటు దక్కలేదు.. టీడీపీ తనకు టికెట్ కేటాయించక పోవడంపై ఆలపాటి ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది.. టీడీపీకి రాజీనామా చేసే యోచనలో ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఉన్నట్టుగా ప్రచారం సాగుతోంది.

Read Also: Farmers Protest: కేంద్ర సర్కార్ తీరుపై రైతుల ఆగ్రహం.. నల్లజెండాలు ఎగురవేయాలని పిలుపు

అంతేకాదు.. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు తెనాలిలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించేందుకు సిద్ధం అయ్యారు ఆలపాటి.. ఈ సమావేశం అనంతరం తన రాజకీయ భవిష్యత్తు పై కీలక ప్రకటన చేసే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.. ఆలపాటి రాజా రాజీనామా చేస్తే.. తెనాలి, గుంటూరు పశ్చిమ, పెదకూరపాడు లాంటి నియోజకవర్గాలపై ఆ ప్రభావం పడుతుందని టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.. అయితే, ఆలపాటి రాజా ఆగ్రహంతో ఉన్నారన్న వార్తలు గుప్పమన్న నేపథ్యంలో.. రంగంలోకి దిగింది టీడీపీ అధిష్టానం.. రాజీనామా చేస్తారన్న ప్రచారంతో ఆలపాటి వద్దకు చేరుకున్నారు మాజీ మంత్రి నక్క ఆనందబాబు, జనసేన los బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, పలువురు టీడీపీ నాయకులు.. ఆలపాటి రాజాకు సర్దిచెప్పే పనిలో పడిపోయారు నేతలు.. అయితే, ఆలపాటి వెనక్కి తగ్గుతారా? లేదా? తెనాలి రాజకీయాల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకోనున్నాయి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.. కాగా, కూటమి పొత్తుల్లో భాగంగా.. తెలినా సీటును జనసేనకు కేటాయిస్తారనే ప్రచారం సాగుతోన్న విషయం విదితమే.