Site icon NTV Telugu

Gun Fire : బర్త్ డే పార్టీలో కాల్పులు.. నలుగురు మృతి

లనలమలచల

లనలమలచల

Gun Fire : అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన చోటుచేసుకుంది. అలబామా రాష్ట్రంలోని డేడ్ విల్లేలోని ఓ డ్యాన్స్ స్టూడియోలో దుండగులు కాల్పులు జరిపారు. బర్త్ డే పార్టీలో దుండగులు జరిపిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. ఘటనలో 20 మందికి పైగా గాయాలయ్యాయి. మహోగని మాస్టర్ పీస్ డ్యాన్స్ స్టూడియోలో శనివారం రాత్రి 10.30 గంటలకు ఈ కాల్పుల ఘటన జరిగింది. కాల్పులు చోటుచేసుకున్న సమయంలో డ్యాన్స్ స్టూడియోలో ఓ యువకుడి బర్త్ డే పార్టీ జరుగుతున్నట్టు సమాచారం. కాల్పులకు దారితీసిన కారణాలు తెలియరాలేదు. కాల్పులకు పాల్పడిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారా లేదా అనే అంశంపై కూడా ఇంకా స్పష్టత రాలేదు.

Read Also: Sai Dharam Tej: నేను తప్పు చేశాను.. నన్ను క్షమించండి.. ఏడిపించేశావ్ కదయ్యా

డేడ్‌విల్లేలో కాల్పుల ఘటనపై అలబామా గవర్నర్ కే ఇవీ స్పందించారు. ఇవాళ పొద్దున్నే ఈ దుర్వార్త వినాల్సి వచ్చిందన్నారు. డేడ్ విల్లే బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అధికార యంత్రాంగం సాయంతో తాము ఎప్పటికప్పుడు తాజా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని కే ఇవీ స్పష్టంచేశారు. డేడ్ విల్లెలో పరిస్థితి అదుపులోనే ఉందని అక్కడి పోలీసులు చెబుతున్నారు. ఇదిలావుంటే అమెరికాలో కాల్పుల సంస్కృతికి తెరపడటం లేదు. ఒక ఘటన మరువక ముందే మరో ఘటన అన్నట్టుగా రోజుల వ్యవధిలోనే ఏదో ఒక చోట కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. అనేక ఘటనల్లో దుండగులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడి ప్రజల ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. ఈ ప్రమాదాలు అభంశుభం తెలియని చిన్నారులు కూడా బలయ్యారు. అనేక సందర్భాల్లో దుండగులు పాఠాశాలలు, కాలేజీలు లాంటి విద్యా సంస్థల్లోకి చొరబడి కాల్పులు జరిపిన ఘటనలు కూడా అనేకం ఉన్నాయి. అమెరికా క్రైమ్ రికార్డ్స్ ప్రకారం అమెరికాలో కాల్పుల బారినపడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య కూడా భారీగానే ఉంది.

Exit mobile version