Site icon NTV Telugu

Akula Srivani : ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై సీసీఎస్‌లో ఫిర్యాదు

Akula Srivani

Akula Srivani

మంత్రి కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలుపై సీసీఎస్ సైబర్ క్రైమ్స్ లో సరూర్ నగర్ బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి పై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో పలువురు బీజేపీ కార్పొరేటర్ లతో కలిసి ఆమె పోలీసుల ఎదుట హాజరై వివరణ ఇచ్చారు. అనంతరం దేశ ప్రధాని, కేంద్ర మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై భాజపా కార్పొరేటర్లు సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బీజేపీ కార్పొరేటర్ పై ఏ విధంగా అయితే హుటాహుటిన కేసు నమోదు చేశారో… అదే విధంగా కేసీఆర్, కేటీఆర్ లపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
Also Read : Peddireddy Ramachandra Reddy: విద్యుత్ తీగల ఘటన.. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం

వారు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వీడియో ఫుటేజ్ ను పోలీసులకు అందజేసినట్లు తెలిపారు కార్పొరేటర్లు. ఇదిలా ఉంటే.. సోషల్‌ మీడియా వేదికగా రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. సోషల్‌ మీడియాలో ప్రధాని మోడీ, అమిత్‌ షాలపై టీఆర్‌ఎస్‌ అనుచిత వ్యాఖలు చేస్తున్నారని బీజేపీ కార్పొరేటర్లు ఆరోపించారు. అంతేకాకుండా.. మోడీ, అమిత్‌షాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీఆర్ఎస్‌ నేతలపై సైతం చర్యలు తీసుకోవాలన్నారు. బీజేపీ నేతలపైన ఏవిధంగా కేసులు పెడుతున్నారో అదే విధంగా టీఆర్ఎస్‌ నేతలపై కేసులు పెట్టి విచారించాలని బీజేపీ నేతలు డిమాండ్‌ చేశారు.

Exit mobile version