దాదాపు 14 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్, దిగ్గజ దర్శకుడు ప్రియదర్శన్ మళ్ళీ జతకడుతున్న సంగతి తెలిసిందే. హేరా ఫేరీతో మొదలైన వీరిద్దరి పరంపర 2010లో వచ్చిన కట్టా మీటా వరకు కొనసాగింది. అక్షయ్- ప్రియదర్శన్ కాంబోలో ఇప్పటి వరకు ఆరు సినిమాలొస్తే అన్ని సూపర్ డూపర్ హిట్సే, కానీ ఎందుకనో కట్టా మీటా తర్వాత కలిసి వర్క్ చేయలేదు. ఇప్పడు వీరిద్దరి కలయికలో వస్తున్న క్రేజీ హారర్ కామెడీ చిత్రం ‘భూత్ బంగ్లా’.
మొదట ఈ సినిమాను ఈ ఏడాది మే15 విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పడు ఈ సినిమా విడుదల తేదీలో మార్పు చోటుచేసుకుంది. ముందుగా ప్రకటించిన మే 15 కాకుండా, ఇప్పుడు ఒక నెల ముందుగా అనగా ఏప్రిల్ 10, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది. శనివారం అక్షయ్ కుమార్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. తన ఇన్ స్టార్ ఖాతాలో “భూత్ బంగ్లా కౌంట్‌డౌన్ రివైండ్! ఏప్రిల్ 10 థియేటర్లలో కలుద్దాం” అంటూ ఒక టీజర్‌ను షేర్ చేశారు. మోహన్ లాల్ లాంటి స్టార్ హీరోతో చేసిన మారక్కర్ బిగ్గెస్ట్ డిజాస్టర్ తర్వాత పిలిచి ఆఫర్ ఇచ్చాడు ఖిలాడీ హీరో. డైరీ ఫుల్ అయినప్పటికీ ప్రియదర్శిని నమ్మి ఛాన్స్ ఇచ్చాడు అక్షయ్. భూత్ బంగ్లా లాంటి హారర్ కామెడీతో ప్రేక్షకులను భయపెట్టేందుకు వచ్చేస్తోన్న ఈ హిట్ కాంబో ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.
