Bollywood Cinema : 15 ఏళ్ల క్రితం విడిపోయిన హీరో అండ్ డైరెక్టర్ కాంబో.. మళ్లీ ఇన్నాళ్లకు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకప్పుడు అక్షయ్‌తో సినిమా చేస్తే మినిమం గ్యారెంటీ అన్న హోప్ నిర్మాతల్లో ఉండేది. కానీ ఈ మధ్య వరుస డిజాస్టర్స్‌తో ఆ నమ్మకాన్ని కోల్పోయాడు అక్షయ్ కుమార్. మళ్లీ ఈ నమ్మకాన్ని తిరిగి తెచ్చుకునేందుకు డిఫరెంట్ జోనర్ చిత్రాలతో ముందుకు వస్తున్నాడు ఈ బీటౌన్ సీనియర్ స్టార్. 15ఏళ్ల తర్వాత తనకు బెస్ట్ సినిమాలిచ్చిన ప్రియదర్శన్‌తో కొలాబరేటయ్యాడు అక్షయ్. ఈ ఇద్దరి కాంబోలో హారర్ కామెడీ భూత్ బంగ్లా తెరకెక్కుతోంది. భూల్ భూలయ్యా తర్వాత మరోసారి హారర్ కామెడీతో వస్తోంది ఈ హిట్ కాంబో. ఇందులో టబు, వామికా గబ్బీ హీరోయిన్స్.
ఇప్పటికే భూత్ బంగ్లా రిలీజ్ డేట్ పలుమార్లు మార్చిన టీం ఎట్టకేలకు అఫీషియల్ డేట్ అనౌన్స్ చేసింది. బాలాజీ మోషన్ పిక్చర్స్ మరియు కేప్ ఆఫ్ గుడ్ ఫిలింస్ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 15, 2026న థియేటర్లలో విడుదల కానుంది ఈ హారర్ కామెడీ. హేరా పేరీ తర్వాత అంటే 25 ఏళ్ల తర్వాత అక్షయ్- టబు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. భూత్ బంగ్లా కేవలం ఒక సినిమాగా కాకుండా, టబుకి అక్షయ్ కి ప్రియదర్శన్ కి అక్షయ్ కి ప్రీవియస్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గుర్తుచేసే ఓ ఈవెంట్ ఫిల్మ్ లా ఉంటుందని టాక్. అక్షయ్ గత 12 ఏళ్ల కెరీర్‌లో అత్యంత ఎక్కువ రన్ టైమ్ తో వస్తోన్న మూవీ భూత్ బంగ్లా. 2014లో వచ్చిన ‘హాలిడే: ఏ సోల్జర్ ఈజ్ నెవర్ ఆఫ్ డ్యూటీ’ చిత్రం తర్వాత, మళ్ళీ ఇంత ఎక్కువ రన్ టైమ్ ఉన్న సినిమా ఇదే . అక్షయ్ కుమార్ సినిమాలంటే తక్కువ రన్ టైమ్ తో స్పీడ్ గా వెళ్లిపోతాయి. కానీ, రాబోయే చిత్రం ‘భూత్ బంగ్లా’ ఏకంగా 2 గంటల 50 నిమిషాల రన్ టైమ్ ఉండటం ఇంటెన్సిటీ క్రియేట్ చేస్తోంది. కామెడీ జానర్‌లో ఇంత నిడివి ఉందంటే, సినిమాలో భారీ స్టార్ కాస్ట్ మధ్య వచ్చే కామెడీ సీక్వెన్స్స్, స్క్రీన్ ప్లే చాలా పకడ్బందీగా ఉండబోతున్నాయని అర్థమవుతోంది. పైగా హర్రర్ కూడా తోడవడంతో కాస్త డెప్త్ ఎక్కువగా ఉండాలి. దానికి ఈ మాత్రం రన్ టైం అవసరం. దాదాపు గత పది సినిమాల నుండి హిట్ చూడని ఖిలాడీ హీరో భూత్ బంగ్లాతో సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడో లేడో చూడాలి.
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..