Akshara Gupta: దేశీయ క్రికెట్లో విధ్వంసం.. 126 బంతుల్లోనే 306 పరుగులు.. వైభవ్ సూర్యవంశీ కంటే డేంజర్‌గా ఉందే.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akshara Gupta: బీహార్ మహిళల అండర్-19 వన్డే ట్రోఫీ టోర్నమెంట్లో బ్యాటర్ అక్షర గుప్తా అరుదైన ఘనత సాధించింది. గురువారం భాగల్పూర్ లోని సండిస్ కాంపౌండ్ మైదానంలో జరిగిన టోర్నీ తొలి మ్యాచ్‌లో ఆమె అజేయంగా 306 పరుగులు చేసి చరిత్రలో తన పేరును లిఖించుకుంది. మహిళల దేశీయ క్రికెట్ చరిత్రలోనే అత్యున్నత వ్యక్తిగత స్కోర్లలో ఒకటిగా ఈ ఇన్నింగ్స్ నిలిచింది.
మ్యాచ్ మొదటి నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడిన అక్షర గుప్తా.. కేవలం 126 బంతుల్లోనే 306 పరుగులు సాధించింది. ఆమె ఇన్నింగ్స్‌లో 55 ఫోర్లు, 8 సిక్సర్లతో 242.86 స్ట్రైక్‌రేట్‌తో 233 నిమిషాల పాటు క్రీజులో నిలిచి ప్రత్యర్థి జట్టుకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ట్రిపుల్ సెంచరీ సాధించింది. అక్షర ఇన్నింగ్స్‌లో కేవలం 16 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేయగా, 34 బంతుల్లో శతకం సాధించింది. ఆ తర్వాత కూడా అదే దూకుడును కొనసాగిస్తూ త్రిశతకాన్ని అందుకుని సంచలనం సృష్టించింది. ఈ దెబ్బతో బీహార్ మహిళల క్రికెట్లో కొత్త రికార్డును నెలకొల్పింది.
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
అక్షర గుప్తా అద్భుత ఇన్నింగ్స్‌పై బీహార్ క్రికెట్ అసోసియేషన్ (BCA) అధికారులు ప్రశంసలు కురిపించారు. బీసీఏ అధ్యక్షుడు హర్షవర్ధన్ మాట్లాడుతూ.. బీహార్ మహిళా క్రికెటర్లు తమ ప్రతిభతో రాష్ట్రానికి పేరు తీసుకువస్తున్నారని కొనియాడారు. బీసీఏ కార్యదర్శి జియౌల్ అర్ఫిన్ కూడా అక్షరను అభినందిస్తూ.. టోర్నమెంట్ ప్రారంభంలోనే ఇలాంటి ప్రతిభ వెలుగులోకి రావడం బీహార్ క్రికెట్ భవిష్యత్తుకు శుభసూచకమని అన్నారు.
తాజావార్తలు
-
Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!