NTV Telugu Site icon

Akira: మెగా ఫ్యాన్స్ కి పూనకాలే.. విశ్వంభరలో చిరంజీవితో అకీరా ?

Akira Nandan

Akira Nandan

Akira: మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటికే చాలా మంది హీరోలుగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ కూడా సినిమాల్లోకి ఎప్పుడెప్పుడు ఎంట్రీ ఇస్తారా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక ఆయనకు సినిమాలు పెద్దగా ఇష్టం లేదని మ్యూజిక్ అంటే చాలా ఇష్టమని పలు సందర్భాలలో అకీరా తల్లి రేణు దేశాయ్ స్పష్టం చేశారు. తన కెరీర్ ఏంటి అనేది తన నిర్ణయానికే ప్రాధాన్యత ఇస్తామని రేణు దేశాయ్ వెల్లడించారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ , మెగాభిమానులు మాత్రం అకీరా నందన్ ను హీరోగా చూడాలని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే త్వరలోనే వీరి కోరిక నెరవేరబోతుందని తెలుస్తోంది. సిల్వర్ స్క్రీన్ పై పవన్ వారసుడిని చూడబోతున్నారు అంటూ ఒక వార్త నెట్టింట్లో వైరల్ అవుతుంది. అంటే అకీరా త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా.. అంటే కాదు కాదు.. కానీ తన పెదనాన్న చిరంజీవి నటిస్తున్న సినిమాలో ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.

Read Also:TG High Court: చార్మినార్ కూల్చమంటే కూల్చేస్తారా? రంగనాథ్ పై హైకోర్టు సీరియస్

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి బింబిసార మూవీ ఫేమ్ వశిష్ట డైరెక్షన్ లో విశ్వంభర అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. పాన్ ఇండియా లెవల్లో అన్ని భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఇప్పటికే ఈ సినిమా దాదాపు 80శాతం టాకీ పార్ట్ పూర్తి చేసుకుందని తెలుస్తోంది. అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కు గుమ్మడి కాయ కొట్టనున్నారు. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి పండుగను పురస్కరించుకొని విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో రాబోతున్న నేపథ్యంలో వివిధ భాష చిత్రాల్లో నటిస్తున్న స్టార్ సెలబ్రిటీలను కూడా ఈ మూవీలో భాగం చేశారని తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కుమారుడు ఆకీరా కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే మనం సినిమాలో అఖిల్ ఎంట్రీ ఇచ్చిన రేంజ్ లో విశ్వంభర సినిమాలో అకీరా ఎంట్రీ ఉండబోతున్నట్లు సమాచారం. అతి త్వరలోనే అకీరా ఈ సినిమా షూటింగులో కూడా పాల్గొంటారని ప్రచారం మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.

Read Also:Delhi CM Atishi: దీపావళి వరకు ఢిల్లీలో గుంతలు లేని రోడ్లు.. సీఎం అతిషి హామీ