NTV Telugu Site icon

Amit Shah: అఖిలేష్ యాదవ్ ప్రశ్నకు అమిత్ షా ఫన్నీ సమాధానం.. నవ్వులే నవ్వులు(వీడియో)

Amith Shah

Amith Shah

లోక్‌సభలో వక్ఫ్ చర్చ సందర్భంగా అఖిలేష్ యాదవ్, హోంమంత్రి అమిత్ షా మధ్య చర్చ జరిగింది. ఈ చర్చ నవ్వుకు దారితీసింది. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా భావించే బీజేపీ తన జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోలేకపోతోందని అఖిలేష్ యాదవ్ విమర్శించారు. పార్లమెంట్ లో సభ్యులు మొత్తం నవ్వారు. అఖిలేష్ ప్రకటనకు అమిత్ షా స్పందించి ప్రసంగం మధ్యలో లేచి నిలబడ్డారు. అఖిలేష్ యాదవ్ నవ్వుతూ ఈ విషయం చెప్పడంతో ఆయన కూడా నవ్వుతూ సమాధానమిచ్చారు. ఇక్కడ చాలా పార్టీలు ఉన్నాయని.. ఐదుగురి నుంచే ఆ పార్టీ అధ్యక్షుడు వస్తారని షా అన్నారు.. అందుకే తమకు ఎక్కువ సమయం పట్టదని విమర్శించారు.

READ MORE: Gaza-Israel: గాజాలో భారీగా ఐడీఎఫ్ దళాల మోహరింపు.. హమాస్ టార్గెట్‌గా ఆపరేషన్ షురూ

‘‘అఖిలేష్‌జీ నవ్వుతూ ఓ విషయం వెల్లడించారు. నేను కూడా నవ్వుతూనే సమాధానం ఇస్తాను. కొన్ని పార్టీల నాయకత్వం ఐదుమంది చేతుల్లో ఉంటుంది. దీంతో ఆ ఐదుగురి నుంచే అధ్యక్షుడిని నియమించుకుంటారు. కానీ మేం ఒక ప్రక్రియను పాటించాలి. 12 నుంచి 13 కోట్ల పార్టీ సభ్యుల నుంచి ఒకరిని ఎంపిక చేసుకోవాలి. అందుకు సమయం పడుతుంది. మీకు సమయం పట్టదు. ఎందుకంటే మరో 25 ఏళ్లు మీరే పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతారు. అందులో మార్పేమీ ఉండదు’’ అని అమిత్‌షా బదులిచ్చారు. దీంతో పార్లమెంట్‌ మొత్తం నవ్వులు పూయించారు. అఖిలేష్ యాదవ్ సైతం తనపై వేసిన కౌంటర్‌కు నవ్వారు.

READ MORE: Gaza-Israel: గాజాలో భారీగా ఐడీఎఫ్ దళాల మోహరింపు.. హమాస్ టార్గెట్‌గా ఆపరేషన్ షురూ