NTV Telugu Site icon

Akhil : అయ్యగారు ఈ సారి రెండు ప్రాజెక్టులు.. హిట్ కొట్టేనా ?

Akhil Akkineni Uv Creations Project Will Be Released In 2 Parts

Akhil Akkineni Uv Creations Project Will Be Released In 2 Parts

Akhil : అక్కినేని అఖిల్ పేరుతో పరిచయం అక్కర్లేదు. చిన్నప్పుడు సిసింద్రీ సినిమా తీస్తే బ్రహ్మండమైన హిట్ కొట్టాడు. పెద్దయ్యాక సూపర్ స్టార్ అవుతాడని ఆనాడు అంతా అనుకున్నారు. పెద్దయ్యాక అఖిల్ అనే సినిమాతో హీరోగా లాంచ్ అయ్యాడు. కానీ ఆ తర్వాత ఎన్ని సినిమాలు చేసినా ఆయనకి అదృష్టం కలిసి రాలేదు. సూపర్ స్టార్ కాదు కదా హీరోగా నిలదొక్కుకోడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. తన కెరీర్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమాతో మాదిరి హిట్టు అందుకున్న ఆయన ఏజెంట్ సినిమాతో భారీ డిజాస్టర్ అందుకున్నాడు. ఆ సినిమాకు చాలా ఎఫర్ట్స్ పెట్టినప్పటికి అయ్యగారికి సక్సెస్ మాత్రం రాలేదు. కానీ ఆ సినిమా డిజాస్టర్ కావడంతో ఇంత వరకు ఓటీటీలో కూడా రిలీజ్ కాలేదు. ఈ ఎఫెక్ట్ మరో సినిమా కూడా అనౌన్స్ చేయలేని పరిస్థితిని తీసుకొచ్చింది. నిజానికి ఏజెంట్ తర్వాత ఆయన చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నాడు. ఏజెంట్ రిలీజ్ అయి దాదాపు ఏడాది పైన అవుతోంది.

Read Also:IND vs NZ 2nd Test: నేటి నుంచే రెండో టెస్టు.. రాహులా, సర్ఫరాజా!

ఏజెంట్ తర్వాత ఒక సినిమా కూడా అనౌన్స్ చేయలేదు. ప్రస్తుతం ఒక్క సక్సెస్ కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆయన ఒకే సారి రెండు ప్రాజెక్టులు తెరకెక్కించబోతున్నాడనే వార్త సినీ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఈ రెండు సినిమాలు కూడా నెక్ట్స్ లెవల్లో, భారీ బడ్జెట్లో ఉండబోతున్నాయట. అనిల్ అనే కొత్త డైరెక్టర్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ ఒక సినిమా నిర్మిస్తోంది. ఇక ఈ సినిమా కోసం అఖిల్ సరికొత్త లుక్ లోకి మారబోతున్నట్లుగా సమాచారం. ఇప్పటివరకు కనిపించిన అఖిల్ లా కాకుండా ఒక సరికొత్త మేకోవర్ అవుతున్నాడని తెలుస్తోంది. ఈ లుక్ లో ఆయన చాలా డిఫరెంట్ గా కనపడబోతున్నాడని చెబుతున్నారు. ఆ లుక్ బయటికి లీక్ కాకుండా చూస్తున్నారు. ప్రస్తుతానికైతే ఆయనను చూసిన వాళ్ళు మాత్రం అఖిల్ డెడికేషన్ కి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. సంక్రాంతి తర్వాత పట్టాలెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. అలాగే అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లలో మరో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు సినిమాలు ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో వేచి చూడాలి.

Read Also:Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. ఘటనాస్థలికి చేరుకున్న 15 ఫైర్ ఇంజన్లు