Site icon NTV Telugu

Akhanda 2 : అఖండ 2 టిక్కెట్ల ధరల పెంపునకు ఏపీ సర్కార్ ఓకే.. ఎంత పెంచారంటే !

Akhanda 2

Akhanda 2

Akhanda 2: అఖండ 2 టిక్కెట్లు ధరల పెంపునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. డిసెంబర్ 4వ తేదీన ప్రీమియర్ షో ధర రూ.600, 5వ తేదీ నుంచి మల్టీప్లెక్స్‌లలో రూ.100,
సింగిల్ థియేటర్ రూ.75 రూపాయలు పెంపునకు అనుమతి మంజూరు చేస్తూ జీఓ విడుదల చేసిన ఏపీ సర్కార్. 10 రోజుల వరకు ఈ ధరల పెంపునకు వర్తింపు ఉంటుందని జీఓలో పేర్కొన్న ప్రభుత్వం.

READ ALSO: HMD XploraOne: పిల్లల కోసం మొదటి స్మార్ట్‌ఫోన్.. HMD XploraOne వచ్చేస్తోంది..

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ ఫుల్ కొలాబరేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ సినిమా ‘అఖండ 2 తాండవం’. ఈ చిత్రాన్ని రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సినిమాను సమర్పిస్తున్నారు. ఈ మూవీకి ఎస్ థమన్ సంగీతం అందించారు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ అభిమానుల్లో అంచనాలను భారీ స్థాయిలో పెంచాయి. ‘అఖండ 2: తాండవం’ 2D, 3D రెండు ఫార్మాట్లలో డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

READ ALSO: The RajaSaab Runtime: ‘ది రాజాసాబ్’ బుకింగ్స్ ఓపెన్.. రన్‌టైమ్‌ ఎంతో తెలుసా..

Exit mobile version