నటసింహం నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ నుంచి రాబోతున్న నాలుగో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అఖండ 2: తాండవం’ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. 2021లో సంచలనం సృష్టించిన ‘అఖండ’ చిత్రానికి ఇది సీక్వెల్ కావడంతో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ బుకింగ్స్ అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఈ సినిమా డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. M తేజస్విని నందమూరి ప్రెసెంట్స్‌లో, రామ్ అచంట – గోపిచంద్ అచంట పెద్ద ఎత్తున నిర్మిస్తున్న ఈ మూవీ, విడుదలైన తాజా పోస్టర్‌లో బాలకృష్ణ జీపు ముందు పవర్‌ఫుల్ అఖండ లుక్‌లో కూర్చొని కనిపించగా, “ది మాసివ్ ఎపిక్ కాంబినేషన్ ఈజ్ బ్యాక్ అగైన్” అనే క్యాప్షన్ ఫ్యాన్స్‌లో హైప్ పెంచింది.
Also Read : Samantha–Raj : ఫోటోలు వైరల్.. ఫిబ్రవరిలోనే సమంత-రాజ్ ఎంగేజ్మెంట్ .. !
కాగా ఈ సినిమా కథాంశం ఈసారి కూడా సనాతన ధర్మం, దైవ శక్తి, దేశభక్తి వంటి థీమ్స్ చుట్టూ తిరుగుతుందని టాక్. మొదటి భాగంలో అఘోరాగా బాలకృష్ణ చూపిన రౌద్ర నటన ప్రేక్షకులను మైమరపించింది. అందుకే ఈ సీక్వెల్‌లో ఆయన పాత్ర మరింత ఇంటెన్స్‌గా, పవర్‌ఫుల్‌గా ఉండబోతోందన్న నమ్మకం ఫ్యాన్స్‌లో ఉంది. అంతేకాకుండా, ఈసారి సినిమా 3D ఫార్మాట్‌లో కూడా రిలీజ్ కానుందన్న సమాచారం అందింది. ఇది థియేటర్లో అఖండ అనుభవాన్ని మరింత గ్రాండియర్‌గా మార్చనుంది.
