Site icon NTV Telugu

Akhanda 2: బాలయ్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘అఖండ 3’ హింట్ చూశారా!

Akhanda

Akhanda

Akhanda 2: బోయపాటి శ్రీను – బాలకృష్ణ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ కాంబినేష్‌లో సినిమా వచ్చిందంటే థియేటర్‌లలో పండగే. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘అఖండ’కు సీక్వెల్‌గా తెరకెక్కిన కొత్త చిత్రం ‘అఖండ2: తాండవం’ నేడు ప్రేక్షకుల ముందుకువచ్చి అలరిస్తోంది. నిజానికి బోయపాటి అఖండ2: తాండవం అని ఏ టైంలో టైటిల్ లాక్ చేశాడో కానీ ఈ సినిమా థియేటర్స్‌లో శివతాండవం సృష్టిస్తుందని బాలయ్య అభిమానులు, సిని ప్రేక్షకులు చెబుతున్నారు.

READ ALSO: Deputy CM Pawan Kalyan: ప్రపంచకప్‌ విజేతలు.. మహిళా అంధుల క్రికెట్ జట్టుకు పవన్‌ కల్యాణ్ సన్మానం..

ప్రస్తుతం ఎటు చూసిన అఖండ 2 సందడే కనిపిస్తుంది. ఇప్పటికే థియేటర్‌ల వద్ద బాలయ్య అభిమానుల సందడి మామూలుగా లేదు. ఈ సినిమాలో బాలయ్య తన నటనతో విశేషంగా ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌‌గా మారడంతో, సోషల్‌ మీడియాలో ‘అఖండ 2’ హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ అవుతోంది. ‘అఖండ 3’ పై మేకర్స్ అప్డేట్ ఇవ్వడంతో బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ‘అఖండ 2’ చివర్లో ‘జై అఖండ’ పేరుతో ‘అఖండ 3’ రానున్నట్లు టైటిల్స్ వేసి మూడో భాగం ఉండనున్నట్లు మేకర్స్ హింట్ ఇచ్చారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించగా, సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని 14 రీల్స్‌ ప్లస్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మించారు.

READ ALSO: Pakistan Political Crisis: పాకిస్థాన్‌లో హిస్టరీ రిపీట్ కానుందా.. భుట్టో-జియా తర్వాత మరో నియంత రాబోతున్నాడా?

Exit mobile version