Site icon NTV Telugu

Akhanda 2 Success Meet: ఈ సినిమాకి బాలయ్య బాబు దైవశక్తితో పనిచేశారు: ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్

Akhanda 2 Success Meet

Akhanda 2 Success Meet

Akhanda 2 Success Meet: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘అఖండ 2: ది తాండవం’. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 12న గ్రాండ్‌గా రిలీజైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్‌తో థియేటర్స్‌లో రన్ అవుతోంది. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించారు. ఎం తేజస్విని నందమూరి సమర్పించారు. ఆదివారం మేకర్స్ సినిమా గ్రాండ్ సక్సెస్ నేపథ్యంలో అఖండ భారత్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్‌ను నిర్వహించారు.

READ ALSO: Balakrishna: ఇది దేవుడు పెట్టిన పరీక్ష.. సినిమా గురించి ప్రపంచం కోడై కూస్తుంది..!

ఈ కార్యక్రమంలో ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. భారతదేశం మొత్తం దద్దరిల్లిపోతుందని అన్నారు. పాన్ ఇండియా లెవెల్‌లో అద్భుతమైన స్పందన వస్తోందని, ఇది భగవంతుడు సృష్టించిన క్యారెక్టర్ అని తమకు అర్థమవుతుందని అన్నారు. ఇలాంటి అద్భుతమైన సినిమాలో తాము కూడా భాగం కావడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. బాలయ్య బాబు ఈ సినిమాకి ఒక దైవ శక్తితో పనిచేశారని, ఇది శివ అనుగ్రహం వల్లే జరిగిందని అన్నారు. థియేటర్స్‌లో ఆడియన్స్‌కు పూనకాలు వస్తున్నాయంటే దానికి కారణం బాలయ్య బాబు పడిన కష్టం అని చెప్పారు. చాలా రోజుల తర్వాత ఒక థియేటర్‌ని టెంపుల్‌గా మార్చిన సినిమా అఖండ అని, ఇంత అద్భుతమైన సినిమాను తమకు ఇచ్చిన డైరెక్టర్ బోయపాటికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అని చెప్పారు.

READ ALSO: Sydney Terror Attack: సిడ్నీలో ఊచకోతకు కారణమైన పాక్ ఉగ్రవాది.. ఇతనే!

Exit mobile version