Site icon NTV Telugu

Director Sandeep Raj: అఖండ 2 రిలీజ్ దెబ్బకు ‘మోగ్లీ’ వాయిదా.. నేనే బ్యాడ్‌లక్ అంటూ డైరెక్టర్ ఎమోషనల్

Sandeep Raj

Sandeep Raj

Director Sandeep Raj: బాలకృష్ణ అభిమానులకు గుడ్‌న్యూస్.. గత కొన్ని రోజుల కిందట వాయిదా పడిన ‘అఖండ-2: తాండవం’ సినిమాకు లైన్ క్లియర్ అయ్యింది. డిసెంబర్ 12న అఖండ 2 థియేటర్లలో విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ 11 రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షోలు పడనున్నాయి. ఈ వార్త ఓ వైపు అభిమానుల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపింది. కానీ.. మరోవైపు.. ఓ డైరెక్టర్ మాత్రం ఎమోషనల్ అయ్యాడు. నేనే దురదృష్ట వంతుడిని అంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. కలర్‌ఫోటో మూవీతో టాలీవుడ్‌లో క్రేజ్ దక్కించుకున్న డైరెక్టర్‌ సందీప్ రాజ్‌. ప్రస్తుతం మోగ్లీ మూవీతో ప్రేక్షకులను పలకరించడానికి సందీప్ సిద్ధమయ్యాడు. ఈ చిత్రంలో యాంకర్ సుమ కనకాల తనయుడు రోషన్ కనకాల హీరోగా నటించాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా డిసెంబర్ 12న థియేటర్లలో విడుదలకు అన్ని విధాలుగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇంతలో గత కొన్ని రోజు కిందట వాయిదా పడిన అఖండ 2కు తాజాగా లైన్ క్లియర్ కావడం.. మోగ్లీ విడుదల ప్రకటించిన తేదీ(డిసెంబర్ 12) రోజే విడుదలవుతుండటంతో సందీప్ ఎమోషనల్ అయ్యాడు. తన సినిమాను పోస్ట్‌పోన్ చేసుకున్నాడు.

READ MORE: Toxic : కౌంట్‌డౌన్ మొదలు పెట్టిన గ్యాంగ్‌స్టర్ ‘టాక్సిక్’.. రిలీజ్ డేట్ ఫిక్స్

“బహుశా ‘క‌ల‌ర్ ఫొటో’, ‘మోగ్లీ’ వంటి సినిమాలు నాకు బదులుగా మరొక దర్శకుడికి తీయాల్సింది. ఈ సినిమాలు వృత్తిపై ఎంతో మక్కువ గల, సినిమాల కోసం ఏదైనా చేయగల కొంతమంది ఉత్సాహవంతులు నిర్మించారు. రెండు చిత్రాల మధ్య కొన్ని కామన్ విషయాలు ఉన్నాయి. 1. అంతా బాగానే జరుగుతుంది అనుకున్న సమయంలో వాటి విడుదలకు వచ్చేసరికి దురదృష్టం ఎదురైంది. 2. రెండోది నేను.. బహుశా నేనే దురదృష్టవంతుడిని. నేను కూడా అదే(బ్యాడ్‌లక్) అనుకుంటున్నాను. “దర్శకత్వం: సందీప్ రాజ్” అనే టైటిల్‌ను బిగ్ స్క్రీన్‌పై చూడాలనే నా కల రోజురోజుకూ కష్టతరం అవుతోంది. సిల్వర్‌స్క్రీన్ నన్ను ద్వేషిస్తుందని నేను అనుకుంటున్నాను.. రోషన్, సరోజ్ గారు, సాక్షి, హర్ష, DOP మారుతి, భైరవ, మరెందరో అంకితభావంతో ఉన్న వ్యక్తుల అభిరుచి, చెమట, రక్తంతో మోగ్లీని నిర్మించారు. కనీసం వారి కోసమే మోగ్లీకి అన్ని మంచి జరగాలని నేను నిజంగా ఆశిస్తున్నాను.” అని సందీప్ ఎమోషనల్ పోస్ట్ చేశాడు.

Exit mobile version