బాలకృష్ణ–బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే టాలీవుడ్‌లో మాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు బ్రాండ్. అటువంటి హిట్ కాంబో నుంచి వస్తున్న ‘అఖండ 2 – తాండవం’ పై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. డిసెంబర్ 5న విడుదల కాబోతున్న ఈ పాన్‌ఇండియా సినిమాపై మొదటి అప్‌డేట్ నుంచే రేంజ్‌కి మించిన బజ్ క్రియేట్ అయింది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో టెక్నికల్‌గా కూడా టాప్ టీమ్ పని చేస్తోంది. మొదటి భాగం బ్లాక్‌బస్టర్ కావడంతో, సీక్వెల్‌పై ప్రేక్షకుల్లో ఉత్సాహం ఇంకా ఎక్కువగా ఉంది. బాలయ్య పవర్‌ఫుల్ లుక్, బోయపాటి స్టైల్ యాక్షన్, మాస్ ఎలిమెంట్స్… అన్నీ కలిసి హైప్‌ను డబుల్ చేస్తున్నాయి.
Also Read : Saailu: నెగిటివ్ టాక్ వస్తే అర్ధనగ్నంగా తిరుగుతా – డైరెక్టర్ షాకింగ్ ఛాలెంజ్
మేకర్స్ ఇప్పటికే ట్రైలర్ లాంచ్‌కి డేట్ ఫిక్స్ చేయగా, ఇక నెలాఖరులో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై మాత్రం సోషల్ మీడియాలో గట్టి రూమర్స్ షేక్ చేస్తున్నాయి. తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం ‘అఖండ 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరవుతారట! ఇండస్ట్రీ వర్గాల్లో ఈ మాటలు హాట్ టాపిక్‌గా మారాయి. ఒకే వేదికపై ఈ ఇద్దరి ప్రెజెన్స్ ఉంటే అదో భారీ మోమెంట్ అవుతుందని ఫ్యాన్స్ కూడా ఎగ్జైట్ అవుతున్నారు. అయితే ఇది అధికారికంగా ప్రకటించలేదు. మేకర్స్ నుంచి ఎలాంటి కన్ఫర్మేషన్ రాకపోయినా, సోషల్ మీడియా మాత్రం ఈ రూమర్‌ను వైరల్ చేస్తోంది. ముఖ్యంగా అల్లు అర్జున్ – బాలయ్య ఒకే స్టేజ్‌పై కనిపిస్తే అదో రేర్ కాంబినేషన్ అవుతుందనే ఆసక్తి చూపుతున్నారు అభిమానులు. త్వరలోనే క్లారిటీ రానుంది.