Site icon NTV Telugu

Akanda 2 : అఖండ 2 కొత్త డేట్ పెండింగ్.. అదే టైంలో తన మూవీ ప్లాన్ చేస్తున్న యంగ్ హీరో !

Akanda 2, Shambala

Akanda 2, Shambala

సినిమా విడుదల వాయిదా పడటం ఇండస్ట్రీలో కొత్తేమీ కాదు. అనుకున్న తేదీల్లో షూటింగ్ లేట్ అవ్వడం, ఓటిటి బిజినెస్ క్లియర్ కాకపోవడం, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఇలా ఎన్నో కారణాలతో చాలా సినిమాలు వాయిదా పడతాయి. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు డేట్ మార్చుకోవడం చాలా కామన్ విషయం. అయితే వాయిదా వేయాల్సి వస్తే.. కనీసం వారం, పది రోజులు ముందుగా‌నే మేకర్స్ ప్రకటిస్తారు. కానీ ‘అఖండ 2’ విషయంలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. అన్ని పనులు పూర్తి చేసి, కొన్ని గంటల్లో థియేటర్లలో సందడి చేయాల్సిన ఈ భారీ చిత్రం హఠాత్తుగా ఆగిపోయింది.

Also Read : The Raja Saab : ది రాజా సాబ్ OTT డీల్ ఫైనల్.. రికార్డు ధరకు దక్కించుకున్న ప్రముఖ సంస్థ!

ఇది నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో ఇప్పటి వరకు ఎప్పుడూ జరగని సంఘటన. సాంకేతిక కారణాల వల్ల రిలీజ్ చేయలేకపోతున్నామని చెప్పినప్పటికీ, ఇండస్ట్రీ టాక్ ప్రకారం 14 రీల్స్ ప్లస్ మరియు ఈరోస్ ఇంటర్నేషనల్ మధ్య జరిగిన ఫైనాన్షియల్ వివాదాలే ఈ అడ్డంకికి ప్రధాన కారణమని చెబుతున్నారు. అయితే ఇంతలోనే, తాజా సమాచారం ప్రకారం ‘అఖండ 2’ను డిసెంబర్ 12 లేదా డిసెంబర్ 25 తేదీల్లో విడుదల చేయాలని మేకర్స్ పరిశీలిస్తున్నారట. ఇదే సమయంలో, మరో ఆసక్తికర పరిస్థితి బాక్సాఫీస్‌ దగ్గర నెలకొనబోతోంది. అదేంటంటే..

యంగ్ హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న ‘శంబాల’ చిత్రం ఇప్పటికే డిసెంబర్ 25న రిలీజ్ అవుతుందని అధికారికంగా ప్రకటించింది. ఒకవేళ ‘అఖండ 2’ కూడా అదే తేదీన విడుదలైతే, బాక్సాఫీస్ వద్ద హాట్ పోటీ తప్పదన్న‌మాట. ఒక వైపు బాలకృష్ణ భారీ పాన్ ఇండియా మాస్ ఎంటర్‌టైనర్, మరో వైపు ఆది సాయి కుమార్ కాన్సెప్ట్ మూవీ బాక్సాఫీస్ వద్ద సెలవు‌ల సీజన్ మరింత ఆసక్తికరంగా మారుతుందా చూడాలి. లేదు అంటే ఆది సాయి కుమార్ టీమ్ తమ సినిమా డేట్ మార్చుకుంటారా? లేదా బాలయ్య సినిమా ముందు నేరుగా పోటీకి దిగి తమ నమ్మకాన్ని నిరూపించుకుంటారా? అన్నది ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Exit mobile version