తెలుగు సినిమాలు బాహుబలి, RRR, పుష్ప వంటి విజయాలతో దేశవ్యాప్తంగా అపారమైన కీర్తిని సంపాదించి కున్నప్పటికీ, పరిశ్రమ ఆర్థికంగా స్థిరంగా లేదు. ప్రతి సంవత్సరం వందల సినిమాలు విడుదలవుతున్న, కేవలం కొన్ని మాత్రమే లాభాల బాట పడుతున్నాయి. గతంలో OTT ప్లాట్‌ఫామ్‌లు నిర్మాతలకు ఒక సేఫ్టీ నెట్‌గా ఉండేవి, థియేటర్లలో ఫలితం ఎలా ఉన్నా వారికి కొంత మొత్తాన్ని భరోసా ఇచ్చేవి. అయితే, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. ప్రధాన OTT ప్లాట్‌ఫామ్‌లు, ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్, తమ కొనుగోలు విధానాలను మార్చాయి. థియేటర్లలో సినిమా హిట్‌ని బట్టి చెల్లింపు మొత్తాన్ని నిర్ణయించే పద్దతిని ప్రవేశపెట్టాయి. దీని ప్రకారం, సినిమా థియేటర్లలో అంచనాలను అందుకోలేకపోతే, అంగీకరించిన మొత్తంలో 25% వరకు తగ్గిస్తారు.. అదే సినిమా బ్లాక్‌బస్టర్ అయితే, ఆ మొత్తాన్ని అదే స్థాయిలో పెంచుతారు.
Also Read : Kantara 2 : ‘కాంతార’ కాంట్రవర్సీకి చెక్ పెట్టిన రణ్ వీర్..
ఈ కొత్త OTT నిబంధనలు నిర్మాతలందరి పై తీవ్రమైన ఒత్తిడిని పెంచుతున్నాయి. సినిమా విడుదలైన నాలుగు వారాలకే OTT లోకి వస్తుండటం వల్ల థియేటర్ కలెక్షన్లు గణనీయంగా తగ్గుతున్నాయి, ఫలితంగా చాలా చిత్రాలు తక్కువ పేమెంట్ పొందే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో, బాలకృష్ణ నటించిన భారీ చిత్రం ‘అఖండ 2’ ఈ కొత్త నెట్‌ఫ్లిక్స్ మోడల్‌ను పాటించనున్న మొట్ట మొదటి పెద్ద సినిమా గా నిలవనుంది. ‘అఖండ 2’ విషయంలో నెట్‌ఫ్లిక్స్ ఎక్కువ మొత్తాన్ని చెల్లిస్తుందా, లేక థియేటర్ ప్రదర్శన ఆధారంగా తగ్గిస్తుందా అనేది తెలుగు చలనచిత్ర పరిశ్రమ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
