Site icon NTV Telugu

Akbaruddin Owaisi: పాతబస్తీలో విద్యుత్‌ చోరీ జరిగితే.. మేమే అడ్డుకుంటాం

Akbaruddin Owaisi

Akbaruddin Owaisi

తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు కొనసాగుతున్నాయి. అయితే.. నేడు అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. హైదరాబాద్ లోని పాతబస్తీ పై కొందరు విమర్శలు చేస్తున్నారన్నారు. పాతబస్తీలో కరెంట్ చోరీ జరుగుతుందని కొందరు రాజకీయ నాయకులు పదె పదె విమర్శిస్తున్నారని ఆయన మండిపడ్డారు. నిజంగా పాతబస్తీలో కరెంట్ చోరీ అయితే … మేము అక్కడ అడ్డుకుంటాని ఆయన వెల్లడించారు. తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి ఈ అంశంపై వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. తెలంగాణలోని పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లలో ఎంఐఎం ప్రజా ప్రతినిధులు ఉన్నారని, మున్సిపాలిటీలలో ఎంఐఎం ప్రజా ప్రతినిధులు ఉన్న చోట పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు.

Also Read : Kethireddy Pedda Reddy: ఇసుక రీచ్ వద్ద జేసీ ఆందోళన.. ఎమ్మెల్యే పెద్దారెడ్డి కౌంటర్

మున్సిపాలిటీలలో బీఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధులకు ప్రాధాన్యత ఇచ్చినట్టే ఎంఐఎం వాళ్ళకి ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. పాతబస్తీలోకి వెళ్ళే దమ్ము సర్కార్‌కు లేదని కొందరు ఎప్పుడు అంటారని, విద్యుత్ శాఖ అధికారులతో నేను సమీక్ష చేశా… 95 శాతం బిల్లు కలెక్షన్ ఉందని వాళ్ళు చెప్పారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు నిరుద్యోగ భృతి ఇవ్వాలని ఆయన కోరారు. కరెంటు ఏసీడీ చార్జీల వసూలు పైన ప్రభుత్వం ఆలోచించాలన్నారు. అంతేకాకుండా.. కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు బిల్లును ఆమోదించాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కి ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ విజ్ఞప్తి చేశారు. బిల్లు క్లియర్ కాక వర్సిటీల్లో ఖాళీల భర్తీ నిలిచిపోయింది. 5 నెలలుగా కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు బిల్లు పెండింగ్‌లో వుంది. వెంటనే బిల్లును ఆమోదించాలని గవర్నర్‌ను అక్బరుద్దీన్ కోరారు.

Also Read : Kolagatla Veerabhadra: సీఎం జగన్ చెప్పినట్లు.. 175 స్థానాలకు 175 గెలిచి తీరుతాం

Exit mobile version