తెలంగాణలో మా ప్రయాణం బీఆర్ఎస్ పార్టీతోనే అని అసెంబ్లీ సాక్షిగా అక్బరుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పని తీరును, మైనారిటీలకు ఈ ప్రభుత్వం అందిస్తున్న చేయూతను అక్బరుద్దీన్ ఒవైసీ కొనియాడారు. సీఏఏను వ్యతిరేకించింది.. యూసీసీకి వ్యతిరేకం అని ప్రకటించినందుకు ధన్యవాదాలు అని అక్భరుద్దీన్ తెలిపారు.
Read Also: Business Idea: రూ.5 వేల పెట్టుబడితో.. రూ.60 వేలు పొందే అవకాశం..
రాష్ట్రంలో ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ చెప్పారు. రాష్ట్రంలో ఎలాంటి ఘర్షణలకు తావులేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఉచితంగా 24 గంటల కరెంటు అందిస్తున్నదని ఆయన వెల్లడించారు. మిషన్ భగీరథతో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మంచినీరు అందిస్తోంది.. తెలంగాణలో రెండంకెల అభివృద్ధి సాధిస్తున్నదని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు, షాదీముబారక్, గురుకులాలు ప్రతి పథకం అద్భుత ప్రతిఫలాలు ఇస్తున్నదని అక్బరుద్దీన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని అన్ని రాష్ట్రాలు చూసి నేర్చుకోవాలన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండటం గర్వంగా భావిస్తున్నానని ఒవైసీ చెప్పారు.
Read Also: IRCON Recruitment: డిగ్రీ అర్హతతో IRCON లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..
రాష్ట్రంలో 50 లక్షల మంది ముస్లీం మైనార్టీలు ఉన్నారని అక్బరుద్దీన్ ఒవైసీ తెలిపారు. మైనార్టీల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.2200 కోట్లు కేటాయించిందన్నారు. మైనార్టీలకు షాదీముబారక్, ఓవర్సీస్ స్కాలర్‌షిప్ లాంటి పథకాలు చేపట్టారని ఆయన పేర్కొన్నారు. రెండో హజ్ హౌస్‌కు ప్రభుత్వం రూ.23 కోట్లు కేటాయించిదన్నాడు. 58, 59 జీవో కింద పట్టాలు ఇచ్చి ప్రభుత్వం పేదలను ఆదుకుంటుంన్నదని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల సక్షేమాభివృద్ధికి కృషిచేస్తుందని ఒవైసీ వెల్లడించారు. మేము కేవలం బీఆర్ఎస్ పార్టీతోనే కలిసి ఉంటామని అక్బరుద్దీన్ ఒవైసీ క్లారిటీ ఇచ్చారు.