NTV Telugu Site icon

Akbaruddin Owaisi : ఆరు గ్యారంటీలలో నాలుగు అమలు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం.. అభినందనలు

Akbaruddin Owaisi

Akbaruddin Owaisi

తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు కొనసాగుతున్నాయి. అయితే.. ఇవాళ అసెంబ్లీలో అక్బుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. డిమానిటైజేశన్ విషయంలో నేనే వ్యతిరేకించానని, అప్పుడు కేసీఆర్.. మోడీ గురించి సభలో కనీసం మాట్లాడనివ్వలేదని ఆయన అన్నారు. అద్భుతమైన నిర్ణయం అని చెప్పుకొచ్చారని, జానారెడ్డి కూడా నోట్ల రద్దును వ్యతిరేకించారని ఆయన వెల్లడించారు. ఆరు గ్యారంటీ లలో నాలుగు అమలు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం..అభినందనలు తెలిపారు. రేషన్ కార్డు నీ అన్ని పథకాలకు ముడి పెడుతున్నారని, చాలామందికి రేషన్ కార్డు లు లేవని, 2022..23 , 2024 లో L &T నష్టపోతే నిధులు ఇచ్చారు కానీ.. ఓల్డ్ సిటీ కి మాత్రం నిధులు ఇవ్వలేదన్నారు అక్బరుద్దీన్‌. ఓల్డ్ సిటీ మెట్రో పనులు వెంటనే ప్రారంభించాలని ఆయన అన్నారు. అక్బర్ సాబ్.. చుక్ చుక్ అంటూ వస్తుంది మెట్రో అంటూ మాటలు చెప్పారని కేటీఆర్ పై అక్బర్ సెటైర్లు వేశారు. మెట్రో వైఎస్ తో వచ్చిందన్నారు.

Accident: ఆగి ఉన్న ట్రాలీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. మహిళ దుర్మరణం, ఐదుగురికి తీవ్రగాయాలు

అయితే.. అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. పాతబస్తీ అంటే ఓల్డ్ సిటీ కాదు.. అది ఒరిజినల్ సిటీ అన్నారు. జైపాల్ రెడ్డి కేంద్ర అర్బన్ డెవలప్ మెంట్ మంత్రిగా వయబుల్ గ్యాప్ ఫండ్ తీసుకువచ్చి హైదరాబాద్ మెట్రో నిర్మాణానికి కృషి చేశారని, పదేళ్ల బీఆరెస్ పాలనలో ఓల్డ్ సిటీకి మెట్రో రైల్ అందుబాటులోకి తీసుకురాలేదన్నారు. మేం అధికారంలోకి వచ్చిన వెంటనే పాతబస్తీ మెట్రోకు శంఖుస్థాపన చేశామని, రెండో దశలో 78 కి.మీ మెట్రో ప్రాజెక్టు కోసం కేంద్రానికి నివేదిక సమర్పించామన్నారు సీఎం రేవంత్‌. నాలుగేళ్లలో ఓల్డ్ సిటీ మెట్రో పనులు పూర్తి చేసే బాధ్యత మాది అని ఆయన వ్యాఖ్యానించారు.

MP Shocker: పోర్న్‌ని చూసి దారుణం.. 9 సోదరిపై 13 ఏళ్ల బాలుడి అత్యాచారం, హత్య..