Site icon NTV Telugu

Akash Deep: ఆకాశ్ దీప్‌ వైల్డ్ సెలబ్రేషన్.. డకెట్‌ భుజంపై చెయ్యి వేసి వీడ్కోలు.. వైరల్ వీడియో

Akash Deep

Akash Deep

Akash Deep: ఐదు టెస్టుల సిరీస్‌లో కీలకమైన ఐదో టెస్టు లండన్‌ ఓవల్ మైదానంలో జరుగుతుండగా.. మొదటి ఇన్నింగ్స్‌లో భారత జట్టు నిరాశపరిచే ప్రదర్శనతో కేవలం 224 పరుగులకే కుప్పకూలింది. ఇక భారత ఇన్నింగ్స్ తర్వాత ఇంగ్లండ్‌ ఓపెనర్లు జాక్ క్రాలీ, బెన్ డకెట్ లు టీమిండియా బౌలర్లపై బజ్‌బాల్ ఆటతీరుతో విరుచుకుపడ్డారు.

Viral News: 18వ అంతస్తు నుంచి పడిపోయిన 3 ఏళ్ల బాలుడు.. ప్రాణాలతో ఎలా బయటపడ్డాడంటే..?

ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో రెచ్చిపోయిన ఓపెనర్లకు ఆకాశ్ దీప్ అద్భుతమైన బంతితో డకెట్‌ను ఔట్ చేశాడు. డకెట్ రివర్స్ స్కూప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించగా, బంతి బ్యాట్ ఎడ్జ్ తాకి వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ చేతుల్లో పడింది. దీంతో 43 పరుగుల వద్ద డకెట్ వెనుదిరిగాడు. ఈ సమయంలో ఆకాశ్ దీప్ కాస్త వైల్డ్ గానే సెలబ్రేట్ చేసుకున్నట్లు కనిపించినా, ఆ తర్వాత వెంటనే డకెట్ భుజంపై చెయ్యి వేసి ఏదో మాట్లాడాడు. అయితే దానికి డకెట్‌ కూడా సమాధానం ఇవ్వడం కూడా కొసమెరుపు. అయితే ఆ సమయంలో వెంటనే కేఎల్ రాహుల్ వచ్చి ఆకాశ్ దీప్‌ ని పక్కకు లాకెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

BSNL Azadi Ka Plan: నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్! కేవలం రూ.1కే 30 రోజులు అన్లిమిటెడ్ డేటా, కాల్స్!

భారత్ 224 పరుగులకే ఆలౌట్ అయిన అనంతరం ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో టీ20 తరహాలో బ్యాటింగ్ చేసింది. లంచ్ బ్రేక్ సమయానికి వికెట్ నష్టంలేకుండా 109 పరుగులు చేసింది. జాక్ క్రాలీ 52 పరుగులతో క్రీజులో ఉండగా, కెప్టెన్ ఓలీ పోప్ 12 పరుగులతో అతనికి జతగా ఉన్నాడు. డకెట్ 38 బంతుల్లో 43 పరుగులు చేసి ఆకాశ్ దీప్ బౌలింగ్‌కు ఔట్ అయ్యాడు.

Exit mobile version